Minister Anitha: ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా అడుగులు.. దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
- ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా అడుగులు
- ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
- ఉత్తరాంధ్రలో త్వరలో భారీ వర్షాల నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాం
- ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మంత్రి సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Vangalapudi Anitha: ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విపత్తుల సమయంలో అత్యవసర సహాయక చర్యల్లో పాల్గొనే ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ (ఏపీఎస్డీఆర్ఎఫ్) బృందాల పటిష్టతకు కృషి చేస్తామన్నారు. మారుతున్న పరిస్థితులను బట్టి ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందికి ప్రతి సంవత్సరం కనీసం 5 సార్లకు తగ్గకుండా వరదలు, తుపానులు, రసాయన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల వంటి అంశాలపై అత్యాధునికి సాంకేతిక శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆమె ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్‌ను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి విపత్తుల వేళల్లో వారి సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకునేందుకు దిశానిర్దేశం చేశారు.
Read Also: Minister Narayana: విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సహకారం అందించండి..
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
సహాయక చర్యల సమయంలో వినియోగించే కొత్త సాంకేతిక పరికరాల జాబితా అందిస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేస్తామన్నారు. విడతల వారీగా వాటిని కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చి ప్రమాదాల సమయంలో నష్టనివారణ చర్యలు వేగంగా జరిగేలా సమిష్టిగా కృషి చేద్దామన్నారు. తద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించడమే కాకుండా, సహాయక చర్యలకు పట్టే సమయాన్ని చాలా వరకు తగ్గించడం సాధ్యమవుతుందన్నారు. ఉత్తరాంధ్రలో ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్లు స్పష్టం చేశారు. అత్యవసర సహాయ చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ ఆరు బెటాలియన్లలోని 600 మంది సభ్యులతో కూడిన 12 బృందాలు సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లకుండా వర్ష ప్రభావమున్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, ఏపిఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్, ఎస్డీఆర్ఎఫ్ డీఐజీ రాజకుమారి, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వివిఎన్ ప్రసన్న, ఏపీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ డి.మురళీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు దార్శనికతలో డ్రోన్ కేపిటల్‌గా అమరావతి : హోం మంత్రి వంగలపూడి అనిత
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో అమరావతి డ్రోన్ కేపిటల్‌గా నిలుస్తుందని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగిన ‘అమరావతి డ్రోన్ సమ్మిట్-2024’ పేరిట జరిగిన కార్యక్రమం దేశంలోనే తొలిసారి అని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత సైతం భాగస్వామ్యమయ్యారు.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!