పారిశ్రామిక ప్రమాదాల నివారణ సూచనలకు హైలెవెల్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్మాగారాలలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు చర్యలను సూచించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కమిటీకి విశ్రాంత ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా నేతృత్వం వహిస్తారు.
వేదాంత గ్రూప్ అనుబంధ సంస్థ సెరెంటికా గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలోని సంస్థ కార్యాలయంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో 10 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణానికి తమ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ప్రగతి పథంలో పరుగులిడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటం అందరి తక్షణ కర్తవ్యమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నైపుణ్యతతో కూడిన మానవ వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని తద్వారా వచ్చే ఆర్థిక ప్రగతితో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాకారం చేసుకోడానికి ప్రజలు తరచుగా అనారోగ్యం పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ, ప్రయివేట్ వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
గుర్ల డయేరియా విషయంలో ఏం జరుగుతుందని పరిశీలించమని అధికారులను ఆదేశించామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సెప్టెంబరు 14 నుంచి డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎంత మంది చనిపోయారనిది ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. ప్రాథమికంగా ఒక్కరు చనిపోయారని చెప్పారు.
నాలుగు గ్రీన్‌ఫీల్డ్ హైవేలకు 45,300 కోట్లు అవసరమని.. ఈ పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆరు ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయన్నారు. 18వేల కోట్లతో పనులు ముందుగా పూర్తి చేస్తారని.. హైదరాబాదు నుంచీ మచిలీపట్నం కనెక్ట్ చేసేలా గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందన్నారు. జాతీయ రహదారుల అధికారులు, ఏజెన్సీలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించామని చెప్పారు.
ఏపీ ప్రజల కలను కేంద్రం నెరవేర్చింది.. పవన్ చొరవతో రైల్వేలైన్‌కు మోడీ ఆమోదం తెలిపారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉంటుందన్నారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానం చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.
అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రూ.252.42 కోట్లు విలువ చేసే రహదారి పనులకు కేంద్రం ఆమోదం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇందులో రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి, ఆధునికీకరణ గురించి కూడా ఉంది.
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరాగాళ్ల ఉచ్చులో చిచ్చుకునే ప్రమాదం ఉంది. తాజాగా భీమవరంకు చెందిన ఓ వ్యక్తికి ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరించి రూ. 73 లక్షలను సైబర్ కేటుగాళ్లు కాజేశారు.