APPSC Chairperson: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ అధికారి అనురాధ నియామకమయ్యారు. ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ అనురాధను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. టీడీపీ హయాంలో కొన్నాళ్ల పాటు ఏఆర్ అనూరాధ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ బాధ్యతలు నిర్వహించారు. గౌతమ్ సవాంగ్ రాజీనామాతో ఏపీపీఎస్సీ ఛైర్మన్ స్థానం ఖాళీ అయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఏపీపీఎస్సీలో గత ప్రభుత్వ అక్రమాలను వెలికి తీసే ప్రక్రియలో భాగంగా రిటైర్డ్ ఐపీఎస్‌కు ఛైర్మన్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించినట్లు తెలుస్తోంది.
Read Also: YS Jagan: కూటమి పాలనలో మహిళలకు రక్షణ, ప్రజలకు భరోసా లేదు..