ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు జులై 27న విచారణ చేపట్టనుంది.
తల్లి సంక్షరణ గురించి విస్మరించిన కూతురికి ఆమె ఆస్తిపై హక్కులు ఉండవని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. తల్లి ఆలనాపాలనా చూసుకోని ఓ కూతురు.. ఆస్తి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేస్తూ ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది.
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో కొవిడ్ లాక్‌డౌన్ ప్రేమకథ మూడు భయంకర హత్యలతో విషాదాంతంగా ముగిసింది. 25 ఏళ్ల నజీబుర్ రెహ్మాన్, 24 ఏళ్ల సంఘమిత్ర ఘోష్‌ల మధ్య లాక్‌డౌన్ సమయంలో మొదలైన ప్రేమ.. ఆమె, ఆమె తల్లిదండ్రుల హత్యకు కారణమైంది.
వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు ఆలయంపై నిర్మించబడిందా లేదా అని నిర్ధారించడానికి సర్వే నిర్వహించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ)ను ఆదేశించిన జిల్లా కోర్టు ఉత్తర్వులపై అలహాబాద్ హైకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది.
శివభక్తుడు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు భక్తకన్నప్ప. ఈయన ఆటవికుడు అయినా అణువణువునా ఈశ్వర భక్తితో జీవితం గడిపాడు. శ్రీ కాళహస్తిలోని ప్రసిద్ధ దేవాలయాలలో శ్రీ భక్త కన్నప్ప స్వామి దేవాలయం ఒకటి. దీనిని స్థానికులు కన్నప్ప కొండ అని పిలుస్తారు.
మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కఠిన చట్టాలు చేసినా వీటిలో మార్పు రావడంలేదు. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసి.. దీనిని ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు.