Gyanvapi Mosque: నేటి నుంచి జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Mosque: వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే సోమవారం ఉదయం ప్రారంభమవుతుందని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఆదివారం నాడు ఏఎస్‌ఐ బృందం కావాల్సిన అన్ని పరికరాలతో వారణాసికి చేరుకుంది. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయమే ఏఎస్‌ఐ అధికారులు మసీదు వద్దకు చేరుకోగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శివలింగం ఉన్నట్టుగా హిందూ ప్రతినిధులు చెబుతున్న ‘వాజుఖానా’ మినహా మసీదులో అంతటా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతుల ద్వారా సర్వే చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. మసీదు హిందూ దేవాలయంపై నిర్మించబడిందని పేర్కొంటూ కొంతమంది మహిళల పిటిషన్‌పై ప్రతిస్పందనగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. మసీదు లోపల పురాతన హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు ఉన్నాయని, శాస్త్రీయ సర్వే మాత్రమే నిజాన్ని వెల్లడిస్తుందని మహిళలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆగస్టు 4లోపు జిల్లా కోర్టుకు నివేదికను సమర్పించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Also Read: Facebook Love: ఫేస్‌బుక్ ప్రేమకథ.. ప్రియుడి కోసం సరిహద్దు దాటి పాక్ వెళ్లిన భారతీయ మహిళ
Also Read
- Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహణకు అనుమతించాలంటూ హిందువుల తరఫున విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది పిటిషన్ వేశారు. దీనిపై వారణాసి జిల్లా కోర్టు జులై 14న వాదనలు విన్నది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించి సర్వేకు అనుమతిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. అయితే శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ నేడు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!