Minister Gottipaati Ravi Kumar: విద్యుత్ రంగంలో గత ప్రభుత్వంలో చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లు అయ్యాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. గత ఐదేళ్లలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడుతోందని అన్నారు. ప్రజల సొమ్మును అప్పనంగా తన అస్మదీయులకు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గానూ గతంలో చేసిన పీపీఏలను జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే రద్దు చేసినట్లు […]
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర 7వేల పై చిలుకు కోట్ల అప్పు కోసం కేబినెట్ అనుమతిపై చర్చించారు
ఇసుకపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయంగా మార్చుకుందని విమర్శించారు. వారం పది రోజుల్లో ఓపెన్ రీచ్‌లను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఏ రోజు ఏం పని చేయాలనే దానిమీద ఒక రూట్ మ్యాప్ తీసుకోమని అధికారులను ఆదేశించామన్నారు.
భవన నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్ లైన్‌లో అనుమతులు జారీ చేసే పోర్టల్‌లో మార్పులు చేస్తోంది ప్రభుత్వం. ఈ మార్పుల్లో భాగంగా పలు రోజుల పాటు ఆన్‌లైన్ అనుమతుల సేవలు నిలిపివేస్తున్నట్లు పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పగిలి లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా అనంతపురం ఇస్కాన్‌కి చెందిన వారిగా సమాచారం.
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై, ముఖ్యమంత్రి విచారణ చేయించాలని కోరారు. తప్పు చేసి ఉంటే తనను శిక్షించాలని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖరరెడ్డి బ్రతికుండగానే జగన్, షర్మిలకు సమానంగా ఆస్తి పంపకాలు చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. జగన్‌కు బెంగుళూరులో ఇల్లు ఉందని షర్మిలకు హైదరాబాద్ లోటస్ పాండ్ ఇల్లు ఇచ్చారని వెల్లడించారు. వివాహం అయినా తర్వాత షర్మిల వాటాలు తీసుకొని మళ్ళీ ఆస్తులు కోరడం సమంజసం కాదన్నారు.
కడప జిల్లాలో ఓ తాగుబోతు హల్‌చల్ చేశాడు. వేంపల్లిలో ఓ తాగుబోతు పీకలదాకా తాగాడు. మద్యం మత్తులో రాయచోటి డిపోకు చెందిన రాయచోటి - వేంపల్లి పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు టాప్ పైకెక్కి నిద్రించాడు. ఇది గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సును వేంపల్లి నుంచి రాయచోటికి తీసుకు వెళ్లే క్రమంలో చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లికు బస్సు చేరుకుంది.
సెప్టెంబర్ నెలలో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు అందించిన సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. వరదలు తగ్గిన 15 రోజుల్లో 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందించింది. ఇప్పటి వరకు మొత్తం రూ.618 కోట్ల పరిహారం నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముందుగా రూ.602 కోట్లు బదిలీ చేశామని...తరువాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి దాదాపు 9 వేల మందికి మరో రూ.16 కోట్లు చెల్లించామని అధికారులు తెలిపారు.