1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో జగదీష్ టైట్లర్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లోని ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం.. కాంగ్రెస్ నాయకుడు గుంపును ప్రేరేపించి, మైదానంలో అల్లర్లకు నాయకత్వం వహించారని దర్యాప్తు సంస్థ సీబీఐ ఆరోపించింది.
ప్రతిపక్ష కూటమి 'ఇండియా' మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో ముంబైలో జరుగుతుందని కాంగ్రెస్, శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఈరోజు ప్రకటించాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీ హోదాను పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
శనివారం బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన సమాచారం మేరకు.. శనివారం మధ్యాహ్నం 2:39 గంటలకు భూకంపం సంభవించింది.
రాజస్థాన్‌లోని భివాడి నుంచి తన ఫేస్‌బుక్ ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు చేరుకున్న అంజు.. మరోసారి వార్తల్లోని హెడ్‌లైన్స్‌లో కొనసాగుతోంది. అంజును పాకిస్థాన్‌కు తీసుకెళ్లేందుకు ప్రేరేపించారని ఆమె భర్త అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల జరిగిన మత హింసకు కారణమైన వారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం 'బుల్డోజర్ చర్య' చేపట్టింది. నూహ్ జిల్లాలో వరుసగా మూడో రోజు బుల్డోజర్ చర్య కొనసాగుతోంది. అల్లర్లకు దెబ్బతిన్న నుహ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని తావ్‌డూ పట్టణంలో శుక్రవారం అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 250 గుడిసెలను అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే.
దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం కోసం ప్రజలపైనే భారం వేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది పాకిస్తాన్‌లో ఇంధనం, ఆహార ధరలలో పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం 1.30 పెరిగింది. వార్షిక ద్రవ్యోల్బణం 29.83 శాతానికి పెరిగిపోయింది.
వితంతువులను దేవాలయంలోకి ప్రవేశించకుండా నిరోధించడం వంటివి చట్టాల ద్వారా పరిపాలించబడే ఈ నాగరిక సమాజంలో జరగవని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. స్త్రీకి తనకంటూ ఒక గుర్తింపు ఉందని స్పష్టం చేసింది.
ప్రముఖ ఆంగ్ల కవి విలియమ్ షేక్‌స్పియర్ 1606లో రచించిన ప్రఖ్యాత నాటకం 'మక్‌బెత్' ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. చాలా భాషల్లో ఈ నాటకం అనువాదం అయింది. అంతే కాకుండా.. అనేక భాషల్లో కొన్ని వేల సార్లు ఈ కథ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా నాటక ప్రదర్శన జరిగింది.
రువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి భారీ ఊరట లభించింది. ఆయన దోషి అని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రమేష్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. భార్యే హంతకురాలిగా పోలీసులు నిర్ధారించారు. ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.