William Shakespeare: ప్రముఖ ఆంగ్ల కవి విలియమ్ షేక్‌స్పియర్ 1606లో రచించిన ప్రఖ్యాత నాటకం ‘మక్‌బెత్’ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. చాలా భాషల్లో ఈ నాటకం అనువాదం అయింది. అంతే కాకుండా.. అనేక భాషల్లో కొన్ని వేల సార్లు ఈ కథ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా నాటక ప్రదర్శన జరిగింది. లక్షల కోట్ల మంది ప్రేక్షకుల మనసుకు ఈ నాటకం చేరువైంది. హాలీవుడ్ 2015లో ఈ కథ ఆధారంగా ‘మక్‍బెత్’ సినిమా రూపొందింది. ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఇంత గొప్ప కథని ఇంగ్లీషు భాష నుంచి తెలుగులోకి అనవదించి రంగస్థలంపై నాటకరూపంలో ప్రదర్శించారు. హైదరాబాద్‍లోని రంగభూమిలో ఈ నాటక ప్రదర్శన ఈనెల 3,4 తేదీల్లో జరిగింది. ఈ నాటకాన్ని రాజీవ్ వెలిషెట్టీ, రాఘవ సంయుక్తంగా అనువదించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, బ్రిడ్జ్ థియేటర్ సంయుక్త సమర్పణలో 30 మంది నటీనటులతో ఈ నటకాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని రంగభూమిలో ప్రదర్శించడం గమనార్హం.
Also Read: Santosh Sobhan: డైరెక్టర్ అవుతాడని అనుకోలే.. కానీ ఇప్పుడు ఓ బ్రాండ్ అవుతాడని నమ్మకం
‘మక్‌బెత్’ నాటకాన్ని అబ్బురపరిచేలా .. సందేశాన్ని కళ్లకు కట్టేలా నటీనటులు తమ పాత్రలో జీవించారు. వికాస్ చైతన్య దర్శకత్వం వహించిన ఈ కళారూపం 3,4 తేదీల్లో సాయంత్రం ఏడున్నరకు ప్రదర్శించారు. ఈ నాటకం ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. నాటకాన్ని వీక్షించిన పలువురు ప్రముఖులు.. నటీనటులను ఎంతగానో ప్రశంసలతో ముంచెత్తారు. కథలోని నాటకీయతను, లోతులను కళ్లకు కట్టినట్లు చూపించారు. ‘మక్‍బెత్’ నాటక ప్రదర్శన నగర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నాటకానికి వికాస్ చైతన్య దర్శకత్వం వహించగా.. సాయి లీల కో-డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ నాటకానికి సూర్య సంగీతం అందించారు.