రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో సమావేశమైంది.
ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి టీ20 జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.
కోకాపేటలోని నియో పోలిస్ ఫేస్-2లోని భూములు హెచ్‌ఎండీఏకు కోట్లు కురిపించాయి. రికార్డు స్థాయిలో హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరానికి రూ.100 కోట్లు ధర పలికింది.
తెలంగాణ నినాదంతో పదేళ్లుగా కేసీఆర్ దోపిడీ పాలన జరుగుతోందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో కాంగ్రెస్ నేత ఆరెంజ్ సునీల్ రెడ్డి స్వాగత సభలో మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు పాల్గొన్నారు.
లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లును బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకించింది. బీఆర్ఎస్ తరఫున చర్చలో ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.