తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. 17 లక్షల విలువ చేసే 281 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారం దొరికింది.
మణిపూర్‌లో జీ20 ఈవెంట్‌ను నిర్వహించకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం ప్రశ్నలు సంధించారు. జీ20 సమ్మిట్‌ను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. మణిపూర్‌లో పరిస్థితి సాధారణ స్థితి నెలకొంటే జీ20 సదస్సును అక్కడ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
ఇంధన ధరలపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి స్పందించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఇంధన ధరలు తగ్గుతాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇది మీడియా ప్రచారం అని, అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఖజురహో-ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో శనివారం మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో రైలును సిథోలి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఆగస్టు 20న తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను జరుపుకోనున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్దకు బైక్‌పై వెళ్లారు.
జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందు నిర్ణయించిన దిశా మీటింగ్‌కు అధికారులు హాజరు కాకపోవడంపై ఆయన మండిపడ్డారు.
జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అని ప్రచారం జరుగుతున్న తరుణంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కేరళలో ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ కలకలం రేపింది. ఉత్తర కేరళ జిల్లాలోని కనిచర్ గ్రామంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందిందని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అక్కడి రెండు పొలాల్లో పందులను చంపాలని ఆదేశించారు.
డెన్మార్క్, నెదర్లాండ్స్ నుంచి ఉక్రెయిన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్‌లను డెలివరీ చేయడానికి అమెరికా ఆమోదించింది. ఆ దేశ పైలట్‌లు శిక్షణ పొందిన తర్వాత వాటిని అప్పగించేందుకు అనుమతిస్తామని వాషింగ్టన్ తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది.