Punganur Riots: పుంగనూరు అల్లర్లలో కొత్త కోణాలు.. 4 రోజుల ముందే టీడీపీ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punganur Riots: పుంగనూరు అల్లర్లలో కొత్త కోణాలు బయటపడ్డాయి. చంద్రబాబు పర్యటనకు 4 రోజుల ముందే అల్లర్లకు టీడీపీ ప్లాన్ చేసినట్లు తేలింది. టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు అనుచరుల వాంగూల్మంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఎదుట చల్లా బాబు అనుచరులు నరీన్‌కుమార్, దూవల అమర్నాథ్, పెద్దన్న సుబ్రహ్మణ్యం నేరం ఒప్పుకున్నారు.
ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు టీం, చల్లా బాబు అనుచరులు స్కెచ్ వేశారని తెలిసింది.. పుంగనూరు హైవేపై చంద్రబాబు మీటింగ్ ఉంటే పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం వేశారు. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్ బాటిళ్లతో రెచ్చిపోవాలని ప్లాన్ చేశారు. అల్లర్లపై పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబుకు ముందే ఆదేశాలు వచ్చాయి. అంగళ్లు, పుంగనూరులో గొడవల పథకాన్ని వాంగూల్మంలో చల్లా బాబు అనుచరులు స్పష్టం చెప్పారు.ఆగస్టు 2వ తేదీన చల్లా బాబు ఇంటి వద్ద రహస్య సమావేశం జరిగిందని.. సమావేశంలో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కీలక నేతలు పాల్గొన్నరని వాంగ్మూలంలో చల్లా బాబు అనుచరులు వెల్లడించారు. పోలీసులపై దాడి చేసి గాయపరిచి, అవసరమైతే హత్యలు చేసైనా అల్లర్లు సృష్టించాలనే ప్లాన్ చేసినట్లు తెలిసింది. పుంగనూరు టౌన్‌లోకి బలవంతంగా దూసుకెళ్తే అల్లర్లు జరుగుతాయని.. పోలీసులు కాల్పులు జరిపే పరిస్థితి ఏర్పడుతుందని.. పోలీసుల కాల్పుల్లో ఎవరైనా టీడీపీ కార్యకర్తలు చనిపోతే..టీడీపీకి ఇమేజ్ వస్తుందని చల్లా బాబు చెప్పారని చల్లా బాబు అనుచరుడు వాంగ్మూలంలో వెల్లడించారు.
Also Read
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
Read Also: AP CS Jawahar Reddy: యూనిసెఫ్ ప్రతినిధుల బృందంతో సీఎస్ జవహర్ రెడ్డి భేటీ
ఆగస్టు 4 మధ్యాహ్నం 3.30కి భీమగాని జంక్షన్ వద్దకు చేరుకున్నామని.. గొడవలు చేయాలని టీడీపీ శ్రేణలకు చల్లా బాబు ఫోన్లు చేశారని తెలిపారు.జంక్షన్ వద్దకు చేరుకోగానే పోలీసుల బారికేడ్లు కనిపించాయని..పోలీసులపై దాడి చేసి చంద్రబాబును పుంగనూరు టౌన్‌లోకి తీసుకెళ్లాలని చల్లా బాబు అందరినీ రెచ్చగొట్టారని వాంగ్మూలంలో తెలిసింది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం కర్రలు , రాళ్లు, బీర్ బాటిళ్లతో దాడి చేశామని, పోలీసులను హత్య చేయాలని ఉద్దేశంతో రాళ్లతో దాడి చేశామని.. ఈ దాడిలో డ్యూటీలో ఉన్న సీఐతో పాటు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని చల్లాబాబు అనుచరుడు చెప్పాడు. దీంతో పోలీసులు తమపై టియర్ గ్యాస్ ప్రయోగించారని.. చల్లా బాబు ఆదేశాలతో పోలీసులపై బీర్ బాటిళ్లతో దాడి చేశామని వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అక్కడ ఉన్న పోలీస్ వాహనంపై డీజిల్ పోసి తగలబెట్టామని చల్లాబాబు అనుచరుడు చెప్పాడు.
Read Also: Srisailam: తిరుమల చిన్నారిపై చిరుత దాడి ఘటన.. శ్రీశైల దేవస్థానం అలర్ట్
తర్వాత అక్కడే ఉన్న పోలీసుల ఐసర్ వాహనాన్ని కూడా ధ్వంసం చేసి నిప్పంటించామని.. బారికేడ్లు తీయాలంటూ పోలీసులపైకి రాళ్లు, కర్రలతో దాడి చేశామని అనుచరుడు చెప్పుకొచ్చాడు. తాము దాడి చేయడంతో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని.. డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ ప్రసాద్‌కు తీవ్ర గాయమైందని చల్లా బాబు అనుచరుడు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. గాయాలైన పోలీసులను అక్కడి నుంచి చికిత్స కోసం తీసుకెళ్లారన్నాడు. గొడవ జరిగిన కొద్దిసేపటికి మా నాయకుడు చంద్రబాబు అక్కడికి వచ్చారని.. చంద్రబాబు వాహనంలోనే చల్లా బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారని అనుచరుడు చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!