త్వరలోనే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ కొత్త టీమ్‌ను సిద్ధం చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ప్రకటించారు.
వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్రం రూ.200 కోట్లు మంజూరు చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌కు ముందస్తు సహాయంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.200 కోట్లను విడుదల చేయడానికి కేంద్రం ఆదివారం ఆమోదం తెలిపింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఆదివారం నాడు 45 ఏళ్ల వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం గొడవపడి తన భార్య, ఇద్దరు పిల్లలను కత్తితో నరికి చంపి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్-3లో కీలకఘట్టం పూర్తి అయినట్లు ప్రకటించింది. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చివరి డీబూస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు శనివారం అర్ధరాత్రి దాటాక ఇస్రో ప్రకటించింది.
దాదాపు 47 ఏళ్ల తర్వాత రష్యా చేపట్టిన మొట్టమొదటి మూన్ మిషన్ లూనా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయింది. ల్యాండింగ్‌కు ముందు విన్యాసాల సమయంలో చంద్రునిపై అంతరిక్ష నౌక కూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ఆదివారం తెలిపింది.
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)కి ఆదివారం ఓ చేదువార్త ఎదురైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గల ఓ గ్రామంలో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన తపస్ డ్రోన్ పరీక్షిస్తుండగా కూలిపోయింది.
ఛత్తీస్‌గఢ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలు ఇప్పటికే ప్రచార జోరును పెంచాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుపెట్టాలని జోరుగా అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రానికి ఆప్ వరాల జల్లు కురిపించింది.
లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో వారి వాహనం రోడ్డుపై నుంచి లోతైన లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీని శనివారం అరెస్టు చేశారు. ఖురేషీని ఇస్లామాబాద్‌లో అరెస్టు చేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల నుంచి హింసాత్మక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉక్రెయిన్ మాస్కోపై ప్రతీకారం తీర్చుకుంది. దీని కారణంగా రష్యా రెచ్చిపోయింది. ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది.