Luna 25: దాదాపు 47 ఏళ్ల తర్వాత రష్యా చేపట్టిన మొట్టమొదటి మూన్ మిషన్ లూనా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయింది. ల్యాండింగ్‌కు ముందు విన్యాసాల సమయంలో చంద్రునిపై అంతరిక్ష నౌక కూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ఆదివారం తెలిపింది. శనివారం మధ్యాహ్నం 2.57 గంటలకు Luna-25తో కమ్యూనికేషన్ పోయిందని రోస్కోస్మోస్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని ఢీకొన్న తర్వాత ఉనికిలో లేదని పేర్కొంది. రోస్కోస్మోస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, మిషన్‌లోని క్లిష్టమైన దశలో అనుకోని సమస్య కారణంగా అంతరిక్ష నౌకతో సంబంధాలు కోల్పోయినట్లు ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఆకస్మిక, ఊహించని ముగింపు రష్యా అంతరిక్ష అన్వేషణ ఆశయాలకు గణనీయమైన ఎదురుదెబ్బను సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ, అంతరిక్ష సంఘాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Read Also: IIT Roorkee : పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఐఐటీ రూర్కి..
రష్యా దాదాపు 47 ఏళ్ల తర్వాక చంద్రుడిపైకి రాకెట్ ప్రయోగం చేపట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువమే లక్ష్యంగా.. అక్కడ నీటి జాడలను కనుక్కోవడమే లక్ష్యంగా ఆగస్టు 11న నింగికెగిసింది. ఈ వారం మొదట్లో వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుడి నమూనాలను సేకరించి అధ్యయనం చేయాలనేది ఈ మిషన్ లక్ష్యం. కాగా, ఆగస్ట్ 11న రష్యా ప్రయోగించిన లూనా-25 రెండు రోజుల కిందట చంద్రుడి వద్దకు చేరుకుంది. అయితే ఆ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. శనివారం చేపట్టిన వేగం తగ్గింపు విన్యాసం సందర్భంగా సాంకేతిక లోపం తలెత్తినట్టు రోస్కోస్మోస్ వెల్లడించింది. ఆటోమేటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, దీంతో వేగం తగ్గింపు విన్యాసం చేసేందుకు వీలు కాలేదని శనివారం తెలిపింది. మరోవైపు భారత్ పంపిన చంద్రయాన్-3 ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధృవం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో మరో రెండు రోజుల్లో ప్రయత్నించనుంది.