DRDO Drone Crash: పరీక్షిస్తుండగా పొలాల్లో కుప్పకూలిన డీఆర్డీవో డ్రోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DRDO Drone Crash: డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)కి ఆదివారం ఓ చేదువార్త ఎదురైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గల ఓ గ్రామంలో డీఆర్డీవో అభివృద్ధి చేసిన తపస్ డ్రోన్ పరీక్షిస్తుండగా కూలిపోయింది. చిత్రదుర్గ జిల్లా హరియూర్ తాలుకాలోని వడ్డికెరె గ్రామంలోని పొలాల్లో డ్రోన్ కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కూలిన డ్రోన్‌ను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం వెనుక నిర్దిష్ట కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: World Cup 2023: ప్రపంచకప్‌లో వికెట్ కీపర్‌గా అతడే బెటర్: గంగూలీ
Also Read
- AR Rahman: "ఆ ఓపిక, సమయం నాకు లేవు".. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
- Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
- Arnab Cyclone Alert: 'అర్నబ్' తుపాను పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
- Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. డ్రోన్ ఖాళీ పొలంలో పడిపోయింది. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా డీఆర్డీవో మానవరహిత వైమానిక వాహనం(యూఏవీ) అభివృద్ధిపై పరిశోధనలు చేస్తోంది. తపస్ పేరుతో రూపొందిస్తున్న ఈ డ్రోన్‌ను ఆదివారం ఉదయం డీఆర్డీవో పరీక్షిస్తుండగా కూలిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి రక్షణ శాఖకు సమాచారం అందింది. ఈ ప్రమాదం తర్వాత డ్రోన్ విరిగిపోయి దాని పరికరాలు నేలపై చెల్లాచెదురుగా ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు. పెద్ద శబ్ధంతో యూఏవీ కూలిన వెంటనే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: DNA Test: డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్న బాయ్ ఫ్రెండ్.. బట్టబయలైన సీక్రెట్
సరిహద్దులను పర్యవేక్షించడానికి, శత్రువులపై దాడి చేయడానికి తపస్ డ్రోన్‌ను డీఆర్డీవో అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం భారత సైన్యంలో దీనిని చేర్చలేదు. డీఆర్డీవో వెబ్సైట్ ప్రకారం, ఈ డ్రోన్ 30 వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. ఈ స్వదేశీ డ్రోన్ సరిహద్దులను పర్యవేక్షించడానికి అలాగే శత్రువులపై దాడి చేయడానికి ఉపయోగపడుతుంది.
తాజావార్తలు
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేవు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాను పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త