ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తృటిలో పెనుప్రమాదం తప్పింది. రెండు విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుమతి ఇచ్చారు. చివరి క్షణాలను టేకాఫ్‌ను రద్దు చేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ఇచ్చిన ఆదేశాలతో టేకాఫ్‌ను నిలిపివేశారు.
చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టేందుకు అంతా సిద్ధమైంది. జాబిల్లిపైకి మన వ్యోమనౌక చంద్రయాన్-3 అద్భుతమైన క్షణాల కోసం యావత్ భారతావని ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. నెట్టింట ఆ ఉత్కంఠ కనిపిస్తోంది. చంద్రుడిపై ల్యాండర్ సురక్షితంగా దిగి, చరిత్ర సృష్టించాలని ప్రతీ ఒక భారతీయుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు.
కొరియా ద్వీపకల్పంలో వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్ వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి ప్రయోగాత్మక పరీక్షను పర్యవేక్షించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
పాకిస్థాన్ మాదీ విదేశాంగ మంత్రి, ఇమ్రాన్‌ఖాన్ సన్నిహితుడైన షా మహమ్మద్ ఖురేషీని పోలీసులు అరెస్ట్ చేయడం దాయాది దేశంలో ప్రకంపనలు రేపుతోంది. అధికారిక రహస్యాల చట్టం కింద ఖురేషీని అదుపులోకి తీసుకోవడం ఈ సంచలనాలకు కారణమైంది.
యెమెన్ గుండా గల్ఫ్ రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఇథియోపియన్ వలసదారులపై సౌదీ సరిహద్దు గార్డులు పేలుడు ఆయుధాలు ప్రయోగించారని, గత సంవత్సరం నుంచి వందల మందిని చంపారని హ్యూమన్ రైట్స్ వాచ్ సోమవారం తెలిపింది.
భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మూడో రౌండ్ మేజర్ జనరల్ స్థాయి చర్చలు దౌలత్ బేగ్ ఓల్డి (DBO) సెక్టార్‌తో పాటు చుషుల్‌లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 18న ప్రారంభమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి.
పంజాబ్‌లోని పాక్ సరిహద్దు వెంబడి ఇద్దరు పాక్ స్మగ్లర్లను అధికారులు అరెస్ట్ చేశారు. బీఎస్‌ఎఫ్, పంజాబ్ పోలీసులు ఫిరోజ్‌పూర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇద్దరు పాకిస్తానీ స్మగ్లర్లను అరెస్టు చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి జరిగింది. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ఆదివారం ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఒకరు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అని భావిస్తున్నారు. ఉగ్రవాదుల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు.