విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండిగో విమాన ప్రయాణికులకు కేంద్ర మంత్రి బోర్డింగ్ పోసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు
ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్... శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించారు.
Husband Murder: ఈ రోజుల్లో ఆస్తికోసం ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. జన్మనిచ్చిన వాళ్లను కూడా ఆస్తి కోసం హత్య చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణంగా హత్యకు గురయ్యాడు. వ్యాపారవేత్త రమేశ్‌కుమార్(54) హత్యకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ సమీపంలో హత్య చేసి ఊటీ ఎస్టేట్‌లో ఆయన మృతదేహాన్ని తగులబెట్టారు. ఉప్పల్-భువనగిరి ప్రాంతంలో ఆయనను హత్య చేసినట్లు తెలిసింది. భార్య నిహారిక, ఆమె […]
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె వివాహంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత పాల్గొన్నారు. శనివారం హైదరాబాద్ లోని సిటాడెల్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం జరిగిన ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు గాయత్రి సొనాక్షి, రుత్విక్ సాయిని మంత్రి సవిత ఆశీర్వదించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
టీడీపీకి కంచుకోటగా శ్రీకాకుళం జిల్లా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎయిర్‌పోర్టు పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు. మూలపేట పోర్టు పూర్తి చేసి సంవత్సర కాలంలో షిప్ వచ్చేలా చేస్తామన్నారు.