Husband Murder: హైదరాబాద్‌లో హత్య.. ఊటీ ఎస్టేట్‌లో నిప్పు పెట్టిన భార్య
- హైదరాబాద్‌కు చెందిన రమేశ్‌కుమార్ దారుణ హత్య
- భర్త రమేష్‌కుమార్‌ను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య నిహారిక
- భువనగిరి ప్రాంతంలో హత్య చేసిన శవాన్ని కర్ణాటకకు తీసుకెళ్లిన నిహారిక..ప్రియుడు నిఖిల్
- కర్ణాటకలోని ఓ కాఫీ ఎస్టేట్‌లో మృతదేహానికి నిప్పు పెట్టిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Murder: ఈ రోజుల్లో ఆస్తికోసం ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. జన్మనిచ్చిన వాళ్లను కూడా ఆస్తి కోసం హత్య చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణంగా హత్యకు గురయ్యాడు. వ్యాపారవేత్త రమేశ్‌కుమార్(54) హత్యకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ సమీపంలో హత్య చేసి ఊటీ ఎస్టేట్‌లో ఆయన మృతదేహాన్ని తగులబెట్టారు. ఉప్పల్-భువనగిరి ప్రాంతంలో ఆయనను హత్య చేసినట్లు తెలిసింది. భార్య నిహారిక, ఆమె ప్రియుడు డాక్టర్ నిఖిల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. వ్యాపారవేత్త రమేశ్‌కుమార్ మృతదేహాన్ని కర్ణాటక పరిధిలోని కొడగు కాఫీ ఎస్టేట్‌లో తగులబెట్టారు. కాఫీ తోటల్లో సగం కాలిన మృతదేహాన్ని కర్ణాటక పోలీసులు గుర్తించారు.
Read Also: Fake Baba : రిటైర్డ్ టీచర్‌ని బురిడీ కొట్టించిన దొంగ బాబాలు..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
మెర్సిడెస్ బెంజ్ కార్‌లో రమేష్ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఊటీ దగ్గర వున్న కాఫీ ఎస్టేట్‌కు నిహారిక తీసుకెళ్లింది. 8 కోట్ల రూపాయల ఆస్తి కోసమే నిహారిక భర్తను హైదరాబాద్‌లో హత్య చేయించినట్టు కర్ణాటక పోలీసులు విచారణలో తేల్చారు. రమేష్ హత్య చేసి కాఫీ ఎస్టేట్‌లో తగుల బెట్టిన రాణా అనే నిందితుడిని హర్యానాలోని ఓ డాబా వద్ద టీ తాగుతుండగా కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ నిఖిల్ మైరెడ్డిది ఏపీలోని కడప జిల్లా కాగా.. మృతుడు రమేష్‌ది హైదరాబాద్ స్వస్థలం. నిహారిక యాదాద్రి జిల్లాకు చెందినవారిగా తెలిసింది. ఆస్తి కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భార్య ఒప్పుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!