Minister Nara Lokesh: ఏపీలో పరిశ్రమల స్థాపనకు మెరుగైన ఎకోసిస్టమ్ కల్పించాం..
- చంద్రబాబు నేతృత్వాన ఏపీలో పరిశ్రమలస్థాపనకు మెరుగైన ఎకోసిస్టమ్ కల్పించాం
- సరైన ప్రతిపాదనలతో వస్తే వెనువెంటనే అనుమతులు..ప్రోత్సాహకాలు
- బోసన్ మోటార్స్ ఇంటిలిజెంట్ లైట్ ఎలక్ట్రికల్ వెహికల్‌ను ఆవిష్కరించిన మంత్రి లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్… శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని సంస్థ కార్యాలయ ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో జెండా ఊపి నూతన వాహనాన్ని అమెరికా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఏపీలో పురుడు పోసుకున్న బోసన్ మోటార్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బోసన్ సంస్థ కార్యాలయంలో పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రి లోకేష్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి ఆన్ వ్యూ సొల్యూషన్స్ ప్రతినిధి జోయల్ మంత్రి లోకేష్‌కు వివరించారు.
Read Also: CM Chandrababu: సీఎం చంద్రబాబుతో ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ.. పలు సమస్యలపై వినతి
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ కు సంబంధించి రూపొందించిన డెమోను ప్రదర్శించారు. తర్వాత ఫాల్కన్ ఎక్స్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమసంస్థ సిరిస్ ఎ స్టార్టప్‌లతో వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు సిద్ధంగా ఉన్న పోర్ట్ ఫోలియోలను వివరించారు. అనంతరం డిజిసెర్ట్ సీఇఓ అమిత్ సిన్హా మంత్రి లోకేష్‌ను కలిసి తమ సంస్థ కార్యకలాపాలను తెలియజేశారు. డిజిటల్ సర్టిఫికేషన్, భద్రతలకు సంబంధించి డిజిసెర్ట్ సురక్షితమైన ఆన్ లైన్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆయా సంస్థల అనుబంధ యూనిట్లను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమలస్థాపనకు సింగిల్ విండో విధానం ద్వారా వెనువెంటనే అనుమతులతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని తెలిపారు. ఏపీ సీఎం, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నేతృత్వాన ఏపీలో పరిశ్రమల స్థాపనకు మెరుగైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేశామని లోకేష్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..