Rammohan Naidu: టీడీపీకి కంచుకోటగా శ్రీకాకుళం జిల్లా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎయిర్‌పోర్టు పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు. మూలపేట పోర్టు పూర్తి చేసి సంవత్సర కాలంలో షిప్ వచ్చేలా చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాకు అయిల్ రిఫైనరీ లేదా ఫార్మాహబ్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలుగు ప్రజలకు మంచి సేవ చేసే అవకాశం టీడీపీ ద్వారా మాకు దక్కిందన్నారు.వెనుకబడ్డ వర్గాలకు గౌరవం, గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం టీడీపీ, ఎన్‌టీఆర్ అని తెలిపారు. బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అండగా టీడీపీ నిలబడిందన్నారు. స్కాలర్‌షిప్, డిజిటలైజేషన్ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
Read Also: Minister Gottipaati Ravi Kumar: గడిచిన ఐదేళ్లలో విద్యుత్ కొనుగోళ్లలో పారదర్శకత లేదు..
చరిత్రలో ఎన్నడూ లేని మెజార్టీతో గెలుపొందామంటే కారణం టీడీపీ కార్యకర్తలేనన్నారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. జిల్లా పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. టీడీపీ కార్యకర్తల పార్టీ అని, కార్యకర్తల కష్టాలకు అనుగుణంగా పార్టీ స్పందిస్తుందన్నారు. రాష్ర్ట అభివృద్దిని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు టీడీపీ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు రావాలన్నారు. అమరావతి రైల్వే లైన్ ఇచ్చామని, రణస్థలం వద్ద హైవేలో ఎలివేటెడ్ వంతెనకు నిధులు మంజురు చేశామని, నరసన్నపేట నుంచి ఇచ్చాపురం వరకూ 4 లైన్ల రహదారి నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.