హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం మాజీ ఎమ్మెల్యే తన్మయ్ భట్టాచార్యపై ఒక మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తన ఒడిలో కూర్చున్నారని మహిళా జర్నలిస్టు ఆరోపించింది. ఈ ఆరోపణల తర్వాత, సీపీఎం పార్టీ నాయకుడు తన్మయ్ భట్టాచార్యను ఆదివారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రకటించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మహాకూటమిలో బీజేపీ అన్నయ్య పాత్రలో ఉన్నప్పటికీ.. శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మరోసారి రాష్ట్రంలో మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది.
పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా ఆందోళనలు చేపట్టిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించింది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న 10 మందిని గుర్తించి.. ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పదిమంది బెటాలియన్స్ కానిస్టేబుళ్లలను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Road Accident: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పేట వద్ద నేషనల్ హైవే 65పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ముందున్న లారీ టైర్ పంచర్ కావడంతో హైవే పక్కకు ఆపి పంచర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్యలో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో బయటికి తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ని అరగంట […]
కడప ఎయిర్‌పోర్టులో కడప - హైదరాబాద్ ఇండిగో కనెక్టింగ్ విమాన సర్వీసును రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, చైతన్య రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఏడాదిగా కడప-హైదారాబాద్ విమాన సర్వీసులు లేవని.. ఎన్నో సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేదన్నారు.
హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ పార్టీపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలు అని విచ్చల విడిగా డ్రగ్స్ దందా జరుగుతోందన్నారు. విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు, కొకైన్‌లు విచ్చల విడిగా తెచ్చి భాగ్య నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దని.. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయన్నారు. వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.
జనగామలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని విజయషాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. షాపింగ్‌మాల్ పూర్తిగా దగ్ధమైంది.