Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రిపై సీబీఐ కేసు చేసింది. లిక్కర్ పాలసీ కేసు నిందితుడు అమన్‌దీప్ సింగ్ ధల్ నుంచి రూ.5 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనీ లాండరింగ్ కేసులో వ్యాపారి అమన్‌దీప్ నుంచి డబ్బులు తీసుకున్నారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అమన్‌దీప్ నిందితుడిగా ఉన్నారు. ఎయిరిండియా ఉద్యోగి దీపక్ సంగ్వాన్‌తో పాటు.. క్లారిడ్జెస్ హోటల్స్ సీఈవో విక్రమాదిత్యపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది.
Read Also: Mokila Land Auction: రేపటితో ముగియనున్న మోకిలా ఫేస్-2వేలం ప్రక్రియ