Putin Dials PM Modi: ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్.. ఏం చెప్పారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin Dials PM Modi: భారత్‌లో జీ20 సమ్మిట్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీకి ఫోన్ చేసినట్లు తెలిసింది. న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్‌కు రాలేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరిగే సదస్సులో రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ పాల్గొంటారని పుతిన్ తెలిపారు. రష్యా నిర్ణయంపై, భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సమ్మిట్ కార్యక్రమాలకు రష్యా మద్దతు ఇచ్చినందురు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Geetika Srivastava: పాక్‌లో భారత తొలి మహిళా డిప్యూటీ హైకమిషనర్‌గా గీతికా శ్రీవాత్సవ..
Also Read
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై పురోగతిని సమీక్షించారు. గత వారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పరస్పరం మాట్లాడిన నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యల గురించి కూడా మాట్లాడారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇరువురు నేతలు టచ్‌లో ఉండేందుకు అంగీకరించారని ప్రధాని కార్యాలయం తెలిపింది.
వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో విదేశాలకు వెళ్లినప్పుడు పుతిన్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్లే దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశాలకు పుతిన్ హాజరు కాలేదు. ఎందుకంటే ఐసీసీలో దక్షిణాఫ్రికా సభ్యదేశంగా ఉంది. దక్షిణాఫ్రికాకు వెళ్తే పుతిన్ అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆయన వీడియో లింక్ ద్వారా బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!