సాధారణంగా చైనా ప్రొడక్ట్స్ గురించి ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. అదే తరహాలో చైనాకు కూడా భద్రతాపరమైన భయం పట్టుకుంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్లు సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్ ఫోన్లూ వాడొద్దని చైనా తమ ఉద్యోగులకు సూచించినట్లు తెలుస్తోంది.
లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా బుధవారం జరుగుతున్న ఆసియా కప్‌లోని మొదటి సూపర్4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ 193 పరుగులకే కట్టడి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు 193 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకు భవిష్యత్ కళ్ళ ముందు కనపడుతోందని.. అడ్డంగా బుక్ అయినట్లు తనకే అర్థం అయినట్లుందని సజ్జల పేర్కొన్నారు.
ఆసియా కప్ 2023 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఆ జట్టు కప్ నుంచి నిష్క్రమించిన ఒక రోజు తర్వాత ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను దురదృష్టం ఓడించింది.
గత జూన్, జులై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు ఈ 20 రోజుల్లో నేలకు దిగొచ్చాయి.
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ప్రధాన సరిహద్దులో బుధవారం కాల్పులు జరిగాయని, ఆ తర్వాత ఆఫ్ఘన్-పాకిస్తాన్ సరిహద్దును మూసివేసినట్లు పాకిస్తాన్ భద్రతా వర్గాలు తెలిపాయి.
ఏలూరు జిల్లా దెందులూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి చుక్కా తేజోమూర్తి కేసులో ఏలూరు వన్‌టౌన్ సీఐ రాజశేఖర్, అడ్వకేట్ సుబ్బారావులపై ఏలూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
సాధారణంగా బిస్కెట్ ప్యాకెట్ కొన్నప్పుడు ఎవరైనా ఎన్ని బిస్కెట్లు ఉంటాయో.. ఎంత బరువు ఉందో అని గమనిస్తారా?. చాలా మంది అయితే లేదు అనే సమాధానం ఇస్తారు. కానీ ఓ వినియోగదారుడు మాత్రం తాను కొనుగోలు చేసిన బిస్కెట్ ప్యాకెట్‌ను మొత్తం గమనించాడు.