Pakistan-Afghanistan Clash: తాలిబాన్, పాక్ సైన్యాల మధ్య ఘర్షణ.. సరిహద్దులో కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Afghanistan Clash: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ప్రధాన సరిహద్దులో బుధవారం కాల్పులు జరిగాయని, ఆ తర్వాత ఆఫ్ఘన్-పాకిస్తాన్ సరిహద్దును మూసివేసినట్లు పాకిస్తాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. స్థానిక నివాసితుల ప్రకారం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లను కలిపే టోర్ఖమ్ సరిహద్దులో కాల్పుల శబ్దాలు వినిపించాయి. కాల్పుల శబ్ధాలు వినడంతో అక్కడున్న ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. ఈ ఘటన తర్వాత టోర్ఖమ్ సరిహద్దును మూసివేశారు. తాలిబన్లు, పాకిస్థాన్ భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయని భద్రతా అధికారి ఒకరు వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Also Read: PM Modi: ఉదయనిధి “సనాతన” వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోడీ..
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
అదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు నంగహార్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ ప్రతినిధి, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ఈ కాల్పులపై ఇంకా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం చాలా కాలంగా కొనసాగుతోందని సంగతి తెలిసిందే. ఇరు దేశాల పౌరులు టోర్ఖమ్ సరిహద్దు గుండా మాత్రమే వచ్చి వెళతారు. అయినప్పటికీ, రెండు దేశాల మధ్య అనేక వివాదాల కారణంగా, ఈ సరిహద్దును మూసివేయవలసి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా టోర్ఖమ్ సరిహద్దును మూసివేశారు. దీంతో సరిహద్దుకు ఇరువైపులా వేలాది ట్రక్కులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇరువర్గాల నుంచి కాల్పులు జరిగిన విషయంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?