Rashid Khan: ఆసియా కప్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నిష్క్రమణ.. రషీద్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashid Khan: ఆసియా కప్ 2023 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఆ జట్టు కప్ నుంచి నిష్క్రమించిన ఒక రోజు తర్వాత ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను దురదృష్టం ఓడించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 292 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే విజయం దిశగా అడుగులేసిన ఆఫ్ఘన్ జట్టు చివరికి రెండంటే రెండు పరుగుల తేడాతో ఓటమి పాలై సూపర్-4 అవకాశాన్ని చేజార్చుకుంది. ఆఫ్ఘన్ సూపర్-4కు చేరాలంటే 37.1 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఈ క్రమంలో ధాటిగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 37.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయింది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన ఆఫ్ఘనిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఒక్క మ్యాచ్‌లో నెగ్గిన బంగ్లాదేశ్ జట్టు సూపర్-4కి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా రషీద్ ఖాన్ పోస్ట్ చేశారు.
Also Read: Rahul Gandhi: ‘ఇండియా’, ‘భారత్’ పేరుపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..!
Also Read
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
“క్రీడలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి. మీరు నేర్చుకోండి, ఎదగండి, బలంగా తిరిగి రండి. ఎల్లప్పుడూ మాకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు” అని రషీద్ ట్విట్టర్‌లో రాశారు. ఆసియా కప్ 2023లో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో శ్రీలంక రెండు పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను తృటిలో ఓడించింది. తద్వారా శ్రీలంక టోర్నమెంట్ సూపర్ 4లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
💔
In sport there are many ups and downs. You learn, grow and come back stronger.
Thank you for always supporting us 🙌#AsiaCup2023 pic.twitter.com/6hF7zzyxf7— Rashid Khan (@rashidkhan_19) September 6, 2023
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేయగా, ఓపెనర్ పాతుమ్ నిశ్శంక 41, కరుణరత్నె 32, అసలంక 36, దునిత్ వెల్లలగే 33 (నాటౌట్), తీక్షణ 28 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో గుల్బాదిన్ 4 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 292 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆఫ్ఘనిస్థాన్ మెరుపు వేగంతో ఆడింది. అయితే, వికెట్లను క్రమం తప్పకుండా పారేసుకోవడంతో ఓటమి పాలైంది. 37.4 ఓవర్లలోనే 289 పరుగులు చేసి విజయానికి మూడు పరుగుల ముందు బోల్తాపడింది. కాస్తంత నిదానంగా, తెలివిగా ఆడివుంటే ఆఫ్ఘనిస్థాన్ గెలిచి ఉండేదే. ప్రణాళిక లోపమే జట్టుకు శాపంగా మారింది.
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!