స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిజమే గెలిచిందని అంటున్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ . నారా భువనేశ్వరి నిజం గెలవాలని యాత్ర చేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు అయితే చనిపోయింది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.
మాజీ మంత్రి కొడాలి నాని మేనకోడలు వివాహా వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుకలో వధువు డా.స్నేహ, వరుడు డా.అనురాగ్ దీపక్‌లను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.
ఏపీలో జరిగే ఎన్నికలు లోకల్, నాన్‌లోకల్ మధ్య పోటీ అంటూ మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నరేళ్లల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్క పండుగ కూడా ఏపీలో జరుపుకోలేదని ఆయన వెల్లడించారు.
దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్, స్టార్ మా, సీరియల్ నటులు... తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి నగరంలోని వివిధ ప్రాతాలలో దుర్గా పూజా మండపాల వద్దకు సందడి చేశారు.
ఏపీ ఈ-చలాన్‌ల డబ్బును మాయం చేశారని గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజు వెల్లడించారు. డీజీ అకౌంట్‌కు అనేక రకాల రూపాలలో ఈ- డేటా చలానాకు సంబంధించిన డబ్బులు వస్తాయని.. డీజీ అకౌంట్స్ ద్వారా వచ్చే నగదు మాయమవడం మొదలైందని ఆయన తెలిపారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. అక్టోబరు 15వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్శించుకోనున్నారు.
చంద్రబాబు అరెస్టుతో బాధలో ఉంటే బాలయ్య తన సినిమా రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదని మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ప్రశ్నించారు. హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయాని ఇటీవల ఆ సంస్థే ప్రకటించిందని ఆయన తెలిపారు.