Karnataka: కట్టుకున్న భార్య, కన్న కొడుకు ఇద్దరూ కలిసి ఆ ఇంటి పెద్దను దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలో మాండ్యా జిల్లాలోని ఓ గ్రామంలో ఓ మహిళ తన కొడుకుతో కలిసి భర్తను హత్య చేసింది. 45 ఏళ్ల వ్యక్తిని భార్య, కుమారుడు శుక్రవారం ఇంట్లో గొడవల కారణంగా చెక్క నాగలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్దూర్ తాలూకాలోని చపురదొడ్డి గ్రామంలో గురువారం రాత్రి జరిగిన సంఘటన తర్వాత సవిత, ఆమె 24 ఏళ్ల కుమారుడు శశాంక్ ఇద్దరూ బెంగళూరుకు పారిపోయారని పోలీసులు తెలిపారు. అయితే వీరిద్దరినీ శుక్రవారం ఉదయం బెంగళూరు నుంచి పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన కారు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సవిత, ఆమె భర్త ఉమేష్‌ల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇంటి సమస్యలపై వారు ఎప్పుడూ గొడవ పడేవారు. ఆమె కొడుకు బెంగళూరులో ఉద్యోగం రావడంతో, ఆమె కూడా అతనితో పాటు అక్కడికి వెళ్లింది. శశాంక్ బెంగళూరులోని ఓ బార్‌లో పనిచేసేవాడని పోలీసులు తెలిపారు. సవిత గత ఆరు నెలలుగా బెంగళూరులో కొడుకుతో కలిసి ఉంటోంది. సవిత గురువారం పితృ పక్ష పూజ చేసేందుకు చాపుర్దొడ్డి గ్రామానికి వచ్చింది. అయితే మహిళ భర్త ఉమేష్ గురువారం ఇంట్లోకి వెళ్లేందుకు నిరాకరించాడు. ఈ సమయంలో ఈ విషయమై మహిళకు, ఆమె భర్తకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొన్ని గంటల తర్వాత, ఇంట్లోకి ప్రవేశించే విషయంపై మహిళ, ఆమె భర్త మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఎందుకంటే అతను తన భార్యపై కొన్ని ఆరోపణలు చేయడంతో ఆమె చాలా కోపంగా ఉంది. దీంతో ఆ మహిళ తన కుమారుడు శశాంక్‌ను గ్రామానికి పిలిపించింది. ఇంటికి చేరుకున్న శశాంక్ తన తల్లిపై చేసిన ఆరోపణలపై తండ్రిని ప్రశ్నించాడు.
Also Read: Gold Shop Robbery: దొంగతనం దాగేనా..? అక్కడ తప్పించుకున్నా..ఇక్కడ పట్టుకున్నారు
ఆ తర్వాత ఇంట్లో ముగ్గురి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో శశాంక్ తన తల్లితో కలిసి ఉమేష్ తలపై చెక్క నాగలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉమేష్ తలకు బలమైన గాయం కావడం, అధిక రక్తస్రావం కావడంతో మృతి చెందినట్లు అధికారి తెలిపారు. భర్త హత్య తర్వాత ఆ మహిళ కొడుకుతో కలిసి బెంగళూరు వెళ్లింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేసి బెంగళూరులో శశాంక్, సవితను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.