Supreme Court: మురుగు కాల్వలు క్లీన్ చేస్తూ మరణిస్తే రూ. 30 లక్షలు చెల్లించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశంలో మురుగు కాల్వల మరణాల ఘటనలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. మురుగు కాల్వలను శుభ్రం చేసే సమయంలో మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వ అధికారులు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని పేర్కొంది. మురుగు కాల్వలను శుభ్రపరిచే సమయంలో శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి కనీస పరిహారంగా రూ.20 లక్షలు చెల్లించాలని జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. “మాన్యువల్ స్కావెంజింగ్ పూర్తిగా నిర్మూలించబడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధారించాలి” అని బెంచ్ పేర్కొంది.
Also Read: NewsClick Case: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, హెచ్‌ఆర్ హెడ్‌లకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Also Read
క్లీనర్ ఇతర వైకల్యాలతో బాధపడుతుంటే అధికారులు రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని తీర్పును ప్రకటిస్తూ జస్టిస్ రవీంద్ర భట్ పేర్కొన్నారు. అటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ సంస్థలు సమన్వయం చేసుకోవాలని, పైగా మురుగు కాలువల మరణాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించకుండా హైకోర్టులు నిరోధించరాదని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో మురుగు కాల్వల మరణాల ఘటనలకు సంబంధించిన పిల్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
జులై 2022లో లోక్‌సభలో ఉదహరించిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో భారతదేశంలో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేస్తున్నప్పుడు 347 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీలో ఈ మరణాలలో 40 శాతం ఉన్నాయి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!