స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ అయింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన హైకోర్టు.. దసరా సెలవుల తర్వాతే విచారిస్తామని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైఎస్సార్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు ప్రకటించబడ్డాయి. వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసిన స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. ఎంపికైన వారి జాబితాను కమిటీ వెల్లడించింది.
భార్య మరణవార్త తెలియడంతో సరిహద్దు భద్రతా దళం(BSF) జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ బీఎస్‌ఎఫ్ జవాను ఫోన్‌లో తన భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో ఉన్న తన భార్య మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.
హీల్స్ అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆడవాళ్లే. మహిళలు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లేటప్పుడు హీల్స్ ధరించడం వల్ల ఎత్తుగా, అందంగా కనిపిస్తారు. హైహీల్స్ ధరించి నడవడం చాలా బాధాకరం, కానీ ఇప్పటికీ మహిళలు ఫ్యాషన్, హోదాతో ముడిపడి ఉన్నందున వాటిని ధరిస్తారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీలో ఓ టీమ్ పనిచేస్తోందని ఆయన అన్నారు.
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం వేదికగా కాంగ్రెస్ విజయభేరి యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రారంభించారు.
సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలో బుద్ది చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నిండాలని రామప్ప దేవాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పూజలు చేసి దేవున్ని వేడుకున్నారని ఆయన వెల్లడించారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విదేశీ వనరుల నుంచి విరాళాలను స్వీకరించేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈరోజు తెలిపారు.