CM Chandrababu: పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర – స్వఛ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.. ఈ సందర్భంగా స్వచ్చ రథాలు ప్రారంభించారు సీఎం.. పారిశుద్ద్య కార్మికులకు పుష్ కాట్స్ పంపిణీ చేశారు.. ఉద్యానశాఖ స్టాల్స్ పరిశీలించారు.. గుంటూరు కారం గురించి అడిగ తెలుసుకున్నారు.. ఆ తర్వాత స్వచ్చ సర్వేక్షణ్ 2047 బ్రోచర్ ను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
ఇక, రాబోయే రోజులన్నీ వినుకొండకు మంచి రోజులే అన్నారు చంద్రబాబు.. స్వర్ణాంధ్ర- స్వఛ్చాంధ్ర కార్యక్రమం కోసం ఇక్కడకు వచ్చాను. చెత్తనుంచి సంపద సృష్టించడంపట్ల సంతోషంగా ఉందన్నారు.. మండలానికి ఒక స్వచ్చ రథం ఇచ్చాం.. ప్రతి వారం మండలంలో అన్ని గ్రామాలు స్వచ్చ రథం తిరుగుతుందని తెలపారు.. పల్నాడు అనగానే పౌరుషాల గడ్డ.. కోటప్పకొండ తిరునాళ్ళు బ్రహ్మాండగా చేశారు. పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలు ఎంతో ఫేమస్ అని వెల్లడించారు.
మంత్రి నారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర- స్వఛ్చాంధ్ర కార్యక్రమాలు నడుస్తున్నాయి. నేను సీఎం అయ్యే సమయానికి రాష్ట్రంలో 108 లక్షల టన్నుల చెత్త రాష్ట్రంలో పేరుకుపోయింది. ప్రజలకు స్వచ్చమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వఛ్చాంధ్రలో పాల్గొంటాను అని వెల్లడించారు చంద్రబాబు.. మార్చి 31 కల్లా వంద శాతం ఇంటి నుంచి చెత్త సేకరించేలా చేస్తాం. చెత్త ద్వారా మళ్లీ వస్తువుల ఉత్పత్తులు చేస్తాం. విశాఖలో చెత్త నుంచి కరెంటు తయారు చేస్తున్నారు. మరో ఐదు ప్లాంట్ల ద్వారా కరెంటు తయారు చేస్తాం అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రాష్ట్రంలో బ్యాన్ చేశాం.. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకొస్తాం అని వెల్లడించారు.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం. ఎమ్మెల్యేలు ప్రజలవద్దకు వెళ్లాలని చెప్పాం అన్నారు చంద్రబాబు.. దేశంలో ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంలో ఇచ్చినంత పెన్షన్ ఇవ్వడం లేదన్నారు.. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. అగ్రిటెక్ అందుబాటులోకి తీసుకొచ్చాం. బిల్ గేట్స్ వచ్చి మన టెక్నాలజీ వినియోగం చూసి ఆశ్చర్యపోయారు. వారసత్వంగా వచ్చే పంటలు పండిస్తే లాభాలు రావడం లేదు. ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం పెడుతున్నాం. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నాం అని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?