Mohammad Amir: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ‘బలుపు’ మాటలు.. టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరదంటూ అక్కసు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Amir: పాకిస్థాన్ ప్లేయర్స్ బలుపు మాటల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తాజాగా టీమిండియాపై మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ మరోసారి విషం కక్కాడు. టీ20 వరల్డ్ కప్ సేమీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించదని ఆమిర్ పునరుద్ఘాటించాడు. అంతకు ముందు కూడా భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మపై నెటిగివ్ కామెంట్స్ చేశాడు. అభిషేక్‌ను స్లాగర్ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తాజాగా ‘హార్నా మనా హై’ అనే టాక్ షోలో పాల్గొన్న ఆమిర్.. భారత్ సెమీస్ చేరదనే తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టాడు. భారత జట్టును తాను విమర్శించడం లేదన్నాడు. టీమిండియా బ్యాటింగ్ తీరు, జట్టు సమష్టిగా ఆడుతున్న విధానాన్ని బట్టే తాను ఈ అంచనాకు వచ్చానని ఆమిర్ వివరించాడు. తన దృష్టిలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు మెరుగ్గా ఉన్నాయని, అందుకే సెమీ ఫైనల్‌కు భారత్ చేరదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
READ MORE: CM Chandrababu: పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
“నా అభిప్రాయాన్ని మీరు ఇష్టపడినా, ద్వేషించినా అది మీ ఇష్టం. భారత్ ఫైనల్ చేరుతుందని నన్ను బలవంతంగా చెప్పమంటారా? వాళ్ళు ఫైనల్ చేరినా, చేరకపోయినా నాకేంటి సంబంధం? వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు పూర్తి స్థాయి క్రికెట్ ఆడుతున్నాయి కాబట్టి అవే సెమీస్ చేరుకుంటాయని నేను భావిస్తున్నాను. ఒకవేళ భారత్ ఫైనల్స్‌కు చేరితే సంతోషమే” అని ఆమిర్ తనదైన శైలిలో స్పందించాడు. భారత్ ఉన్న గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు తాను ఎందుకు మద్దతు ఇస్తున్నానో గతంలో విడుదల చేసిన ఓ వీడియోలో కూడా ఆమిర్ వివరించాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మినహా మిగతా అన్ని మ్యాచ్‌లలోనూ భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిందని తెలిపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఆడుతున్న తీరు చూస్తుంటే ఏ జట్టునైనా ఓడించగలవని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!