Minister Anam Ramanarayana Reddy: వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన డీఆర్సీ సమావేశానికి ఆయనతో పాటు మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లాకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. జిల్లాకు తలమాణికమైన వెలుగొండ ప్రాజెక్ట్ త్వరతగతిన పూర్తి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జిల్లా సమీక్షా మండలి సమావేశంలో రాజకీయాలకు తావు ఇవ్వలేదన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ భేటీ
ప్రకాశం జిల్లా అభివృద్ధి తమకు ముఖ్యమని.. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయితే అటు నెల్లూరు జిల్లాకు కూడా సాగు, తాగు నీరు వస్తుందన్నారు. జిల్లా ప్రజలకు సాగు, త్రాగు నీరు ఇవ్వటానికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఒంగోలు జాతి ఎద్దుల బ్రీడ్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో స్వచ్ఛమైన నెయ్యినే వాడమని ఆదేశాలు ఇచ్చామన్నారు. హైస్పిడ్ బోట్లతో తమిళనాడు జాలర్లు ప్రకాశం జిల్లా మత్స సంపదను దోచుకొని పోతున్నారని.. దీనిపై అతిత్వరలో తమిళనాడు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విదంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం హామీ ఇచ్చారు.