పు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నమైన, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వరికపూడిసెల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి, బాలరాజుపై కాంగ్రెస్ దాడి చేయించిందా అని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్సే దాడి చేయించిందని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇస్తుందని అనుకుంటున్నామని ఆయన తెలిపారు.
ప్రజలు ఏ పార్టీని కోరుకుంటున్నారనే చూసే కాంగ్రెస్‌లో చేరానని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకున్నానని ఆయన తెలిపారు. నాకు స్వార్థం ఉంటే అధికార పార్టీలోనే ఉండే వాడినని ఆయన వెల్లడించారు.
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి మహేశ్వరం నియోజక వర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9:30 నుండి రాచాలుర్ గ్రామంలో ప్రచారం ప్రారంభించి భేగంపేట్, గూడూరు, మాల గూడూరు, బేగరి కంచే, మీర్ఖన్ పేట్ ఆకుల మైలారం, పలు గ్రామాల్లో కొత్త మనోహర్ రెడ్డి ర్యాలీగా పర్యటించారు.
ఈనెల 23న విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ-20 మ్యాచ్ జరగనుంది. టీ-20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకాలు 15, 16 తేదీల్లో పేటీఎం (ఇన్‌సైడర్.ఇన్) ద్వారా ఉ. 11.00 గం. నుంచి జరుగుతాయని ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథరెడ్డి తెలిపారు.
పీలో కరువు విలయతాండవం చేస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, సీఎం జగన్ కనీసం స్పందించడం లేదన్నారు.
మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు అని.. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రేపు(నవంబర్ 15) అరకులోయలో పర్యటించనున్నారు. జన జాతీయ గౌరవ దివస్, వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రలను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభించనున్నారు.