Kotha Manohar Reddy: గడప గడపకు ప్రచారంలో దూసుకుపోతున్న మనోహర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kotha Manohar Reddy: బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి మహేశ్వరం నియోజక వర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9:30 నుండి రాచాలుర్ గ్రామంలో ప్రచారం ప్రారంభించి భేగంపేట్, గూడూరు, మాల గూడూరు, బేగరి కంచే, మీర్ఖన్ పేట్ ఆకుల మైలారం, పలు గ్రామాల్లో కొత్త మనోహర్ రెడ్డి ర్యాలీగా పర్యటించారు. ఇక, సాయంత్రం 4 గంటల నుంచి సార్లరావు పల్లి, సాయిరెడ్డి గూడ, ముచ్చర్ల, దాసర్లపల్లి తండా, దాసర్లపల్లి, నేద్నుర్, మన్యే గూడ ప్రాంతాలలో పర్యటించారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీని.. కబ్జా ప్రభుత్వం అయిన బీఆర్‌ఎస్‌ను తొక్కుకుంటూ ఏనుగు అనూహ్యంగా దూసుకుపోతోందని మహేశ్వరం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి అన్నారు.
Also Read
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
మహేశ్వరం నియోజక వర్గంలో నిరంతరాయంగా సాగుతున్న గడప గడప ప్రచార కార్యక్రమంలో బీఎస్పీ అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి దూసుకుపోతున్నారు. పల్లె బాట పట్టిన కొత్త మనోహర్ రెడ్డి ఒకవైపు తను చేసిన సేవ కార్యక్రమాలు.. మరొక వైపు అధికార ప్రభుత్వం చేసిన అవినీతిని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి నిజమైన నాయకుడు రానున్నాడని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
ఇక, మహేశ్వరం నియోజకవర్గంలో ఏనుగు పార్టీ దూసుకుపోతుంది. నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డికి స్థానిక ప్రజలు కేఎంఆర్ ట్రస్ట్ లబ్ధిదారులు, మహిళలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించాలని బీఎస్సీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి కోరారు. పదవి లేకపోయినా నిరంతరం పేద ప్రజల మధ్య ఉంటూ కేఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా 3000 మంది నిరుపేదలకు 60 గజాల ఇంటిస్థలం అందజేశానని కొత్త మనోహర్ రెడ్డి వెల్లడించారు. తాను గెలిచిన వెంటనే మహేశ్వరం నియోజక వర్గంలోని నిరుపేదలను గుర్తించి వారికి కూడా 60 గజాల ఇంటి స్థలాన్ని అందజేస్తానని ఆయన పేర్కొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జా చేసిన భూములన్నీ తిరిగి పేద ప్రజలకు పంచి పెడతానని హామీ ఇచ్చారు. ఎప్పుడు మీతోనే ఉండి.. ఆపద వచ్చినప్పుడు కూత వేటు దూరంలో ఉండే నాయకుడు కావాలా.. లేక ఎలక్షన్ లు రాగానే అధికార దాహంతో విచ్చల విడిగా డబ్బులు, మందు, పంచి మళ్లీ ఎన్నికల తర్వాత కనిపించకుండ పోయే నాన్ లోకల్ లీడర్లు కావాలా మీరే తేల్చుకోవాల అని కొత్త మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!