ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌పై ఎంపీ, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దరఖాస్తు చేసుకోకపోయినా పరీక్షలకు అనుమతిస్తారా కేసీఆర్ అంటూ ఆయన ప్రశ్నించారు. దరఖాస్తు చేయకుండా మెడికల్ కాలేజీలెట్లా మంజూరు చేస్తారో చెప్పు అంటూ ప్రశ్నలు గుప్పించారు.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతి రోజు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు.
సీఎం జగన్ ప్రభుత్వాన్ని చూసి బీజేపీ, జనసేన, టీడీపీ భయపడుతున్నాయని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతిపక్షాల సంక్షేమం అభివృద్ధిపై గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.
అంబర్‌పేట నియోజకవర్గంలో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారంలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా నేతలు ప్రణాళికలు రచించి బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ ప్రచారాల్లో జోరు పెంచారు.
ఉద్యమాలతో సంబంధం లేకుండా అసైన్డ్ భూములు పేదలకు సీఎం జగన్ ఇచ్చారని మంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు. లంక భూములు, చుక్కల భూములు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సమగ్ర కులగణన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ కె.మాధవిలత అధ్యక్షత వహించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, పూర్వపు ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న 5 జిల్లాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు హాజరయ్యారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భూములకు హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీనివల్ల 20 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
అమరావతిలోని సెక్రటేరియట్‌లో 'జగన్మోహనం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు తమ చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు.