Kaleru Venkatesh: అంబర్‌పేట నియోజకవర్గంలో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారంలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా నేతలు ప్రణాళికలు రచించి బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ ప్రచారాల్లో జోరు పెంచారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పలువురు బీజేపీ సీనియర్ నాయకులు ఈరోజు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారని కాలేరు వెంకటేష్ తెలిపారు.
Also Read: CM KCR : ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్
ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ.. అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశాలను ప్రజలకు తన దైన శైలిలో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేశ్, స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ సహా వందలాది గులాబీ దండుతో కలిసి అంబర్‌పేట్ డివిజన్ బాపు నగర్ సాయిబాబా టెంపుల్ నుంచి ప్రారంభించి ప్రేమ్ నగర్, చెన్నారెడ్డి నగర్, పలు బస్తీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ తెలంగాణ అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్లలా భావించి సీఎం కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారన్నారు.