Vijayasai Reddy: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతి రోజు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు.”జగన్ ప్రభుత్వం సమగ్ర కులగణనకు శ్రీకారం చుట్టింది. దీనికి మీరు అనుకూలమా… వ్యతిరేకమా పురంధేశ్వరి గారూ? వేల కోట్ల ప్రజాధనం దోచుకున్న చంద్రబాబు గారి ప్రయోజనాలే మీకు ముఖ్యం కదా. ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు? బీసీలు జడ్జిలుగా పనికిరారు. వారి తోకలు కత్తిరించాలనేది చంద్రబాబు పాలసీ. మీ విధానం కూడా అదేనేమో?” అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
జగన్ గారి ప్రభుత్వం సమగ్ర కులగణనకు శ్రీకారం చుట్టింది. దీనికి మీరు అనుకూలమా… వ్యతిరేకమా పురంధేశ్వరి గారూ? వేల కోట్ల ప్రజాధనం దోచుకున్న చంద్రబాబు గారి ప్రయోజనాలే మీకు ముఖ్యం కదా. ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు? బిసీలు జడ్జిలుగా పనికిరారు. వారి తోకలు కత్తిరించాలనేది చంద్రబాబు…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 17, 2023
మరో ట్విట్టర్ ( ఎక్స్ ) పోస్ట్‌లో.. “పురంధేశ్వరికి కిందటి లోక్ సభ ఎన్నికల్లో విశాఖ స్థానం నుంచి పోటీ చేసినపుడు 20 పోలింగు బూత్‌లలో ఒక్క ఓటు కూడా పడలేదు. మరో 40 బూత్‌లలో పది లోపలే పడ్డాయి. అయినా ఆమె రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలయ్యారు. అందరికీ అలా కలిసి వస్తుందా ఏంటి? కాషాయ పార్టీకి నాయకత్వం వహిస్తూ పచ్చ పార్టీకి కాపలా కాయడం ఆమెకు మాత్రమే సాధ్యం.” అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
పురందేశ్వరి గారికి కిందటి లోక్ సభ ఎన్నికల్లో విశాఖ స్థానం నుంచి పోటీ చేసినపుడు 20 పోలింగు బూత్ లలో ఒక్క ఓటు కూడా పడలేదు. మరో 40 బూత్ లలో పది లోపలే పడ్డాయి. అయినా ఆమె రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలయ్యారు. అందరికీ అలా కలిసి వస్తుందా ఏంటి? కాషాయ పార్టీకి నాయకత్వం వహిస్తూ పచ్చ పార్టీకి…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 17, 2023
మరో ట్వీట్‌లో”రాష్ట్ర ప్రజలంతా చర్చించుకుంటున్నారు…బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారని. దాని గురించి ఏదైనా చెప్పగలరా పురంధేశ్వరి గారూ? మీరు పోటీ చేసే స్థానాన్ని మీ పార్టీ డిసైడ్ చేస్తుందా లేక మీ బావ గారు నిర్ణయిస్తారా? ఆయన మద్ధతు కోసమేగా మీరు ఆయనపై ఈగ కూడా వాలకుండా చూస్తున్నారు!” అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలంతా చర్చించుకుంటున్నారు…బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారని. దాని గురించి ఏదైనా చెప్పగలరా పురంధేశ్వరి గారూ? మీరు పోటీ చేసే స్థానాన్ని మీ పార్టీ డిసైడ్ చేస్తుందా లేక మీ బావ గారు నిర్ణయిస్తారా? ఆయన మద్ధతు కోసమేగా మీరు ఆయనపై ఈగ కూడా వాలకుండా…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 17, 2023