Kaleru Venkatesh: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్ నేతలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. అంబర్‌పేట్‌లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు.
Read Also: KTR: అభివృద్ధి పనులు చేసిన మన ముఖ్యమంత్రిని మళ్ళీ గెలిపించుకుందాం..
నల్లకుంట డివిజన్‌లో కాలేరు వెంకటేష్ తన ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను అందజేస్తూ.. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. పూలు చల్లి, హారతులు పట్టి స్వాగతిస్తున్నారని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని చెబుతున్నారని ఆయన తెలిపారు.