Dehydration in Winters: చలికాలంలోనూ డీహెడ్రేషన్.. ఈ చిట్కాలతో మిమ్మల్ని మీరు రక్షించుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dehydration in Winters: చలికాలంలో మనకు దాహం ఎక్కువగా వేయదు.. దీని కారణంగా మనం తక్కువ నీరు తాగుతాము. కానీ, దీని వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడి మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది మన శరీరంలోని ఎలక్ట్రోలైట్లను అసమతుల్యత చేస్తుంది, దీని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి చలికాలంలో నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. అయితే దాహం వేయకపోవడం వల్ల నీరు తాగడం మరిచిపోతాం. అయితే భయపడాల్సిన అవసరం లేదు, శీతాకాలంలో డీహైడ్రేషన్‌ను నివారించే కొన్ని చిట్కాలను మేము మీకు చెప్పబోతున్నాము. ఆ చిట్కాలు పాటిస్తే డీహెడ్రేషన్ నుంచి మనకు మనం కాపాడుకోవచ్చు.
Read Also: Bussiness Idea : మీ సొంత ఊరిలో ఉంటూ లక్షలు సంపాదించాలని అనుకుంటున్నారా?
Also Read
- AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
- Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
- OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
- Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
*రిమైండర్ సెట్ చేయండి..
చలికాలంలో చెమట పట్టకపోవడం వల్ల దాహం తక్కువగా అనిపిస్తుంది. అయితే దీని వల్ల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇందులో మీ స్మార్ట్ ఫోన్ మీకు సహాయం చేస్తుంది. మీరు మీ ఫోన్లో రిమైండర్‌ను సెట్ చేయవచ్చు, తద్వారా మీరు ప్రతిసారీ నీరు తాగడం గుర్తుంచుకోవాలి. దీంతో శరీరంలో నీటి కొరత ఉండదు.
*ఒక బాటిల్ పక్కన పెట్టుకోవాలి..
చలికాలంలో తరచుగా నీరు తాగాలంటే మళ్లీ మళ్లీ లేవాల్సి వస్తుందని భావించి నీళ్లు తాగం. ఈ కారణంగా, మనం ఎక్కువసేపు నీరు త్రాగకుండా ఉంటాము, ఇది మన శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అందుచేత, మీరు పదే పదే నీరు త్రాగడానికి లేవకుండా, మీ శరీరంలో నీటి కొరత లేకుండా ఉండటానికి, మీతో ఒక వాటర్ బాటిల్ ఉంచుకోవాలి.
*కెఫిన్, ఆల్కహాల్ మానుకోండి
శరీరంలో కెఫిన్, ఆల్కహాల్ అధికంగా ఉండటం వల్ల మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అయితే, చలికాలంలో కాఫీ వగైరా తాగడం ఉత్సాహాని కలగజేస్తాయి. అయితే కాఫీని తక్కువ పరిమాణంలో త్రాగడానికి ప్రయత్నించండి. రోజుకు ఒకసారి మాత్రమే త్రాగండి. ఇది మీ శరీరంలోని డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది.
*కూరగాయలు, పండ్లు తినండి
మీ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లను చేర్చడం వల్ల డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దోసకాయ, బొప్పాయి, పియర్ మొదలైనవి తినండి, వీటిలో మంచి మొత్తంలో నీరు ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి నీరు చాలా వరకు అందుతుంది.
*సూప్, వేడి పానీయాలు త్రాగాలి
చలికాలంలో మనకు తరచుగా వేడిగా ఏదైనా తాగాలని అనిపిస్తుంది. అందువల్ల, మీరు కొన్ని పానీయాలు లేదా సూప్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడతాయి. దీని కోసం మీరు టొమాటో సూప్, హాట్ చాక్లెట్ మొదలైనవి తాగవచ్చు. ఇవి శీతాకాలానికి గొప్ప పానీయాలు కావచ్చు.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!