Minister RK Roja: కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలు దర్శనాలలో భాగంగా క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి రోజా పేర్కొన్నారు. క్షీరా రామలింగేశ్వర స్వామి పార్వతి అమ్మవార్ల ఆశీస్సులు జగనన్నకు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఇంకో 20-30 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలి రాష్ట్ర ప్రజలకు కష్టాలు లేకుండా సంతోషమైన జీవితాన్ని అందించాలని కోరుకున్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మా అందరికీ కూడా కల్పించాలని క్షీరా రామలింగేశ్వర స్వామిని కోరుకున్నామన్నారు.
Read Also: Minister Bhatti: ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశం
తిరుపతి అన్నదానం విషయంలో ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఏ పని లేకుండా ఎక్కడా జరగని తప్పులను ఎక్కడో వాళ్లు చిత్రీకరించి ఎక్కడో జరిగినట్టుగా చూపిస్తున్నారన్నారు. తల తోక లేకుండా వాళ్లు సోషల్ మీడియాలో ప్రచురించే దాన్ని పరిశీలిస్తే అది తప్పు అనే విషయం మీకే తెలుస్తుందన్నారు. శ్రీవాణి ట్రస్టు అనేది పదివేల రూపాయలతో ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకుంటారో అది మాత్రమేనన్నారు. ఇప్పుడు సమయం వేళలు కూడా మార్చడం జరిగిందని.. గతంలో ఉదయం ఐదు గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం ఉండేది దాన్ని 10 గంటలకు మార్చడం జరిగిందన్నారు. తెల్లవారుజాము నుంచి సాధారణ భక్తులకి పేదవారికి ఎక్కువగా దర్శనాలు కల్పించడం జరుగుతుందన్నారు.