KP Nagarjuna Reddy: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బృందావన అపార్ట్‌మెంట్ సమీపంలో గల పార్కులో ఏర్పాటుచేసిన ‘ఆంధ్రాకి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి.. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించారు.
Read Also: Andhrapradesh: కేంద్ర బృందంతో సీఎం జగన్ భేటీ.. మిచౌంగ్ తుఫాన్ నష్టం అంచనాలపై చర్చ
తదుపరి వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వార్డులో ముఖ్య నాయకుడు, చెన్నకేశవ స్వామి పాలకమండలి సభ్యుడు పెరుమాళ్ళ కాశీ సురేష్ ఇంట్లో ఏర్పాటుచేసిన తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైస్ ఛైర్మన్లు షేక్ ఇస్మాయిల్, అంజమ్మ, జేసీఎస్ కన్వీనర్ పత్తి రవిచంద్ర, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.