Bhogapuram Green Field Airport: విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనులు జరుగుతున్న తీరును మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనుల కోసం రూ. 5వేల కోట్లు ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టిందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 36 నెలల్లో జీఎంఆర్ వారు ఎయిర్ పోర్టును పూర్తి చేసి అందిస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు. పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే ఇంకా ముందే పూర్తి చెస్తారని అనిపిస్తోందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేసిందన్నారు. విశాఖను అభివృద్ధి చెయ్యకుండా అమరావతిపైనే పెట్టుబడులు పెట్టారన్నారు.
Read Also: Kishan Reddy: అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయండి.. కేరళ సీఎంకు కిషన్ రెడ్డి లేఖ
గతంలో శిలాపలకం వేసి కనీసం పనులు ప్రారంభించ లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని వైవీ సుబ్బా రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు భోగాపురం ఎయిర్ పోర్టు పరిధిలో ఉన్న వివాదాలను పరిష్కరించి శంకుస్థాపన చేసుకున్నామన్నారు. అలాగే జీఎంఆర్ పనులు ప్రారంభించిందన్నారు. 36నెలల్లో 2025లో ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నామన్నారు. ఈ ఎయిర్‌పోర్టు పూర్తైతే లక్ష ఉద్యోగాలు వస్తాయని… అలాగే పరోక్షంగా మరెందరో ఉపాధి పొందుతారన్నారు. దత్త పుత్రుడు మళ్లీ ఇవ్వన్నీ మేమే చేశామని చెబుతారని ఆయన విమర్శించారు. కానీ, పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చెప్పేందుకే ఇప్పుడు విజిట్ చేశామన్నారు.
Read Also: Revanth Reddy: గత చరిత్ర పై చర్చ చేద్దామా..? కేటీఆర్ పై రేవంత్ ఫైర్
జీఎంఆర్ సంస్థ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పనులను చేపట్టిందని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. అలాగే జీఎంఆర్ ప్రతిష్టాత్మకమైన ఎల్ అండ్ టీతో ఒప్పందం కుదుర్చుకొని పనులు చేపట్టారన్నారు. 3.8 కిలో మీటర్ల రన్ వే పనులు ఇప్పుడు చేస్తున్నారని మంత్రి తెలిపారు. నాలుగు వేల ఏడు వందల కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. రన్ వే, టెర్మినల్ పనులు జరుగుతున్నాయన్న ఆయన.. శంషాబాద్‌లాగే భోగాపురం చుట్టు ప్రక్క ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పది వేల మందికి ప్రత్యక్షంగా, యాభై వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 2203 ఎకరాలు తీసుకొని జీఎంఆర్‌కు అప్పగించామన్నారు. 23లో 16 కిలోమీటర్ల మేర కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తైందన్నారు. 404 కుటుంబాలను షిఫ్ట్ చేశామని మంత్రి వెల్లడించారు.