ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం వారణాసి-న్యూఢిల్లీ మధ్య రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అదునాతన ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ రైలుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
పార్లమెంట్‌లో గతవారం నెలకొన్న భద్రతా వైఫల్యం ఘటనపై ఇరు సభల్లో విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో రాజ్యసభ, లోక్‌సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఈ క్రమంలో లోక్‌సభలో ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటువేశారు.
ఈ నెల 20న(ఎల్లుండి) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు.
ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023ని ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది.
ఏపీలో జనసేన పార్టీకి మరో బిగ్‌షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జనసేనకు చెందిన పలువురు కీలక నేతలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ వైసీపీలో చేరారు.
ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. సోమవారం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌తో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా కూడా పాల్గొన్నారు.
భారతదేశపు అతిపెద్ద శత్రువు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందన్న వార్త తర్వాత సోషల్ మీడియాలో అనేక వాదనలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో తలదాచుకున్న దావూద్ విషప్రయోగం చేశారన్న ఆరోపణలతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ట్విట్టర్ వేదికగా చాలా మంది దావూద్‌కు విషప్రయోగం చేశారని, ఆ తర్వాత అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలని, కొవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.