టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభ నేడు జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభను టీడీపీ శ్రేణులు నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులను వన్యమృగాల భయం వీడడం లేదు. ఇటు టీటీడీ, అటు అటవీశాఖ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా జనావాసాల్లోకి జంతువులు చొరబడుతూనే ఉన్నాయి.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోంది. తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్రంలో 402 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. నాలుగు కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
రేపు వరుస కార్యక్రమాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
ఏపీలో అప్పుల గురించి తీవ్ర స్థాయి దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ప్రత్యేక కార్యదర్శి. దువ్వూరి కృష్ణ వెల్లడించారు. విభజన నాటికి ఉన్న అప్పు రూ 1.18 లక్షల కోట్లు.. అది 2019 నాటికి 2.64 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఇక 2023 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 4.28 కోట్లుగా ఉందన్నారు.
ఏపీలో 17 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగులు చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 8 మంది ఐఏఎస్‌లకు వివిధ ప్రాంతాల్లో సబ్ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చింది.