Divya Pahuja: దివ్య పహుజా మృతదేహాన్ని తరలించిన కారు పాటియాలాలో లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divya Pahuja: మాజీ మోడల్ దివ్య పహుజా హత్యకు గురైన గురుగ్రామ్ హోటల్ నుంచి ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన బీఎండబ్ల్యూ కారు పంజాబ్‌లోని పాటియాలాలో దొరికింది. కారు లాక్ చేయబడి ఉంది. కారులో దివ్య మృతదేహం ఉందో లేదో పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. దివ్య మృతదేహాన్ని పంజాబ్‌లోని నదిలో పడేసినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు ముందుగా తెలిపారు. పాటియాలాలోని బస్ స్టేషన్‌లో బీఎండబ్ల్యూ కారు ఉందని గురుగ్రామ్ క్రైమ్ విభాగం డిప్యూటీ కమిషనర్ విజయ ప్రతాప్ సింగ్ తెలిపారు. రెండు ఫోన్‌లలో ఒకటి దివ్యకు చెందినదని, మరొకటి హత్యలో ప్రధాన నిందితుడు అభిజీత్ సింగ్‌కు చెందినవి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. దివ్యకు మరో ఫోన్ ఉందని ఆమె సోదరి పోలీసులకు చెప్పడంతో ఆ పరికరం కోసం వారు వెతుకుతున్నారు.
గురుగ్రామ్ హోటల్‌లో మాజీ మోడల్, గ్యాంగ్‌స్టర్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ దివ్య పహుజా హత్యకు గురైన సంగతి తెలిసిందే. హోటల్ యజమాని, అతని సహచరులు హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ హత్య ఉదంతం, నిందితులు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. బీఎమ్‌డబ్ల్యూ కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి గుర్తు తెలియని ప్రదేశంలో పడేసినట్లు తెలిసింది. ప్రస్తుతం కారు మాత్రం దొరకగా.. ఆమె మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. హత్యకు కారణం ఇంకా తెలియరాలేదు.
Also Read
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
Read Also: Divya Pahuja: గ్యాంగ్‌స్టర్ మాజీ ప్రియురాలు దివ్య పహుజా మర్డర్.. సీసీటీవీలో హంతకులు..
దివ్యపహుజా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు. గండోలికి సంబంధించి బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఈమె ఏడేళ్ల పాటు జైలులో ఉన్నారు. గతేడాది జూన్ నెలలో బెయిల్ మంజూరైంది. మంగళవారం గురుగ్రామ్ హోటల్‌లో హత్యకు గురైంది. పహుజా కనిపించడం లేదని ఆమె కుటుంబం ఫిర్యాదు చేయడంతో ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
గురుగ్రామ్‌లోని సెక్టార్ 14 పోలీస్ స్టేషన్ అధికారులు మాట్లాడుతూ.. 27 ఏళ్ల దివ్య పహుజా జనవరి 1న తన స్నేహితుడు అభిజిత్ సింగ్‌తో కలిసి బయటకు వెళ్లిందని, అప్పటి నుంచి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. చివరిసారిగా ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ హోటల్ సమీపంలో ట్రేస్ అయ్యాయి. ఈ హోటల్ అభిజిత్ సింగ్‌దిగా అధికారులు చెబుతున్నారు. పోలీసులు హోటల్ సీసీటీవీని పరిశీలించగా.. కారిడార్‌లో దివ్య మృతదేహాన్ని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ కేసులో అభిజిత్ సింగ్, అతని సన్నిహితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని కనుగొనేందుకు పోలీసులు గాలిస్తున్నారు. సింగ్ అతని సన్నిహితులకు రూ. 10 లక్షలు ఇచ్చి డెడ్ బాడీని పడేయాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు.
గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు:
దివ్య పహుజాకు గ్యాంగ్ స్టర్ సందీప్ గడోలీతో సంబంధాలు ఉన్నాయి. 2016లో పహుజా, గడోలి కలిసి ముంబైలోని ఓ హోటల్లో ఉండగా.. హర్యానా పోలీసులు రైడ్స్ చేశారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో గడోలీ మరణించాడు. అయితే ఆత్మరక్షణలోనే గడోలీని కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు, కానీ నిరాయుధుడైన గడోలీపై కాల్పులు జరిపినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దివ్య పహుజా తల్లి సోనియా పహుజా హర్యానా పోలీసులతో నిరంతరం టచ్‌లో ఉంటూ వీరిద్దరి ఆచూకి తెలియజేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన తర్వాత దివ్య, ఆమె తల్లి, కొంతమంది పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాంబే హైకోర్టు ఏడేళ్ల తర్వాత వీరికి బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన కొద్ది నెలలకే హత్యకు గురైంది.
తాజావార్తలు
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..