London: బ్రిటన్‌లోని లండన్ అండర్‌గ్రౌండ్ రైలులో ఒంటరి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దోషిగా తేలిన 43 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి తొమ్మిది నెలల జైలు శిక్ష పడింది. ఉత్తర లండన్‌లోని వెంబ్లీ నివాసి ముఖేష్ షాకు లండన్ ఇన్నర్ క్రౌన్ కోర్ట్ ద్వారా శిక్ష విధించబడింది. గత నెలలో అతను అభ్యంతరకరమైన చర్యకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఈ క్రమంలో 10 సంవత్సరాల పాటు లైంగిక నేరాల రిజిస్టర్‌పై సంతకం చేయాల్సిందిగా ఆదేశించబడింది. బ్రిటీష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీస్ (BTP) ఈ సంఘటన నవంబర్ 4, 2022న జరిగిందని, అతను 10 సంవత్సరాల పాటు లైంగిక హాని నిరోధక ఆర్డర్‌కు లోబడి ఉంటాడని తెలిపారు.
బ్రిటీష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీస్ దర్యాప్తు అధికారి మార్క్ లూకర్ మాట్లాడుతూ.. ముఖేష్ షా నీచమైన చర్యలు అతన్ని కటకటాల వెనక్కి నెట్టాయన్నారు. అంతే కాకుండా విడుదలైన తర్వాత భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు ఆంక్షలు కూడా విధించారు. మేము లైంగిక నేరాల నివేదికలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని, నేరస్థులను శిక్షించడానికి శక్తి మేరకు కృషి చేస్తామని దర్యాప్తు అధికారి వెల్లడించారు.
Read Also: B.Tech Student Suicide: తల్లి మందలించిందని.. తన తండ్రి పిస్టల్‌తో కాల్చుకుని కొడుకు ఆత్మహత్య
బాధితురాలు సడ్‌బరీ టౌన్, ఆక్టన్ టౌన్ మధ్య ఒంటరిగా ప్రయాణిస్తుండగా.. రాత్రి 11.40 గంటలకు ముఖేష్ షా రైలు ఎక్కినట్లు కోర్టుకు తెలిపారు. రైలు ఖాళీగా ఉన్నా కానీ ఉద్దేశపూర్వకంగానే ముఖేష్ షా బాధితురాలు ముందే కూర్చున్నాడు. అతను తన వైపే చూస్తు్న్నాడని ఆమె అసౌకర్యానికి గురైంది. అనంతరం అతడు ఆమె ముందే తన బట్టలు తీసి హస్తప్రయోగం ప్రారంభించినట్లు ఆమె అధికారులకు వెల్లడించింది. బాధితురాలు అతని చర్యలను ఫోన్‌లో చిత్రీకరించింది. అతను ఇంకా చెలరేగిపోవడంతో ఆ మహిళ తనను విడిచిపెట్టమని కోరింది. అనంతరం బాధితురాలు బ్రిటీష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీస్‌కు సమాచారం అందించింది. ముఖేష్ షాను ఆమె ఇచ్చిన వీడియో ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు.