MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉండవచ్చు కానీ ఆయన ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు ధోనీని స్నేహితుడే మోసం చేసినట్లు తెలిసింది. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్‌లపై క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ప్రపంచ స్థాయిలో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు దివాకర్ 2017లో ఎంఎస్‌డీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
అయితే అగ్రిమెంట్‌లో పేర్కొన్న నిబంధనలను పాటించడంలో దివాకర్ విఫలమయ్యారు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ రుసుము, షేర్ లాభాలను చెల్లించవలసి ఉంది. కానీ, మిహిర్ దివాకర్, సౌమ్య బిస్వాస్ ఆ షరతును నెరవేర్చలేకపోయారు. దాంతో ఎట్టకేలకు ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.
Read Also: ACB Trap: పాల బిల్లు చెల్లించేందుకు లంచం.. ఏసీబీకి చిక్కిన కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్..!
‘ధోనిని ఆర్కా స్పోర్ట్స్ మోసం చేసింది’
ధోని అనేక లీగల్ నోటీసులు పంపినప్పటికీ, ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు, షరతులు విస్మరించబడ్డాయి, దీనితో ధోనీ ఆగస్టు 15, 2021న సంస్థకు ఇచ్చిన అధికార లేఖను రద్దు చేశాడు. ధోనీ అనేక సార్లు లీగల్ నోటీసులు పంపాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆర్కా స్పోర్ట్స్ మోసం చేసిందని, దీంతో రూ.15 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కోర్టులో ధోనీ తరపున వాదించిన దయానంద్ సింగ్ తెలిపాడు. ఆర్కా స్పోర్ట్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత మిహిర్ దివాకర్ తనను బెదిరించాడని, దుర్భాషలాడాడని ఆరోపిస్తూ ధోనీ స్నేహితుడు చిట్టుగా ప్రసిద్ధి చెందిన సిమంత్ లోహానీ కూడా ఫిర్యాదు చేశాడు.
ఎంఎస్ ధోని ఇటీవలే తన నూతన సంవత్సరాన్ని దుబాయ్‌లో గడిపిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ధోనీ తన కుటుంబం, స్నేహితులతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నట్లు కనిపించాడు. ఈ పర్యటనలో ధోనీతో పాటు భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ కూడా కనిపించాడు. ధోనీ తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో క్రిస్మస్ జరుపుకున్నాడు. మొదటిసారిగా డిసెంబర్ 19న యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం దుబాయ్ చేరుకున్న తర్వాత రిషబ్ పంత్ ఎంఎస్ ధోనిని కలిశాడు. డిసెంబరు 2022లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్.. ఐపీఎల్ వేలం సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌తో ఒప్పందం కూర్చున్నాడు.ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్ ఇద్దరూ ఐపీఎల్ 2024 సమయంలో పోటీలోకి దిగనున్నారు.