సందట్లో సడేమియాలాగా సంక్రాంతి షాపింగ్‌లో కిలాడీ లేడీల చేతివాటం చూపించారు. ఖంగు తినిపించే వ్యూహంతో చీరల దొంగతనానికి పాల్పడ్డారు. ఇంతలోనే సీసీ కెమెరాల్లో చూసి నిర్వాహకులు అలెర్ట్ కాగా.. సమయ స్పూర్తితో కిలాడి లేడీలను పట్టించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడుతున్న వారందరూ చంద్రబాబు కోవర్టులే.. ముందు నుంచి చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని ఆయన ఆరోపించారు. వైసీపీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణపై నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి విడత చర్చలు పూర్తి అయిన సంగతి తెలిసిందే.
టీచర్ పోస్టుల కోసం ఎదురుచూసే వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు అన్నది త్వరలో విడుదల చేస్తామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్‌లోని బీఎఫ్-3లో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకున్నారు.
తెలుగు జాతి రత్నం, నిజాయతీకి నిలువుటద్దం అయిన రిటైర్డ్ డీజీపీ బాబూరావుకు ప్రతిష్టాత్మక ఫ్రాన్స్ ఎకోల్ సుపరీయర్ రాబర్ట్ డీసోర్బన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది. భారతదేశంలో ఎంతోమంది ప్రముఖుకు అందించిన ఈ అవార్ట్ ఇప్పుడు బాబూరావును వరించింది.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.