టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు 17ఏపై దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.
శబరిగిరులు స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోషతో పులకించాయి. అయ్యప్ప నామస్మరణతో భక్తుల హృదయాలు పరవశించిపోయాయి. శబరిమలలో మకరజ్యోతి కనువిందు చేసింది. భక్తులకు మకరజ్యోతి దర్శన భాగ్యం కలిగింది. పొన్నాంబలమేడు కొండపై నుంచి భక్తులకు మకరజ్యోతి దివ్య దర్శనం జరిగింది. జ్యోతి దర్శనం కోసం అక్కడికి చేరుకున్న లక్షలాది మంది అయ్యప్పస్వాముల అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలోనూ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతోంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి.
ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు అక్కడ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన మరొక విద్యార్థి అమెరికాలోని వారి కనెక్టికట్ వసతి గృహంలో చనిపోయారని కుటుంబసభ్యులు సోమవారం వెల్లడించారు. విద్యార్థులను తెలంగాణలోని వనపర్తికి చెందిన జి దినేష్ (22), ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన నికేష్ (21)గా గుర్తించారు.
దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా దొంగ ఓట్లు సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్చడం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై ధర్నా చేస్తున్న సమయంలో గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పులివర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు.
రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. పన్నెండున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు.
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి మొదటి రోజు భోగి సందర్భంగా ఊరూరా భోగి మంటలు వేసి పండుగను ప్రారంభించారు. ఇక సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు మొదలయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతుంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి.
ఏపీ కాంగ్రెస్‌లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన తరుణంలో ఆ స్థానంలో వైఎస్ షర్మిలను నియమించే అవకాశాలున్నాయని సమాచారం.