Rooster Fight: ఉమ్మడి కృష్ణా జిల్లాలో జోరుగా కోడి పందాలు.. లక్షల్లో బెట్టింగ్, చేతులు మారుతున్న కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rooster Fight: ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతోంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి. హైటెక్ అంగులతో కోడి పందాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్లు, యాంకర్ల హడావుడితో కోడి పందాలు ఊపందుకున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 782 పందెం బర్లు ఉంటాయని అనధికార లెక్కలు చెబుతున్నాయి.
340కు పైగా పెద్ద బరులు ఉంటాయని అంచనా. లక్షల్లో పందాలు వేస్తుండగా.. కోట్లాది రూపాయలుచేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో సుమారు రూ. 100 వంద కోట్లు చేతులు మారినట్టు అంచనా.అసలు పందాలకు పోటా పోటీగా పైపందాలు జరుగుతున్నాయి. బరిలో అసలు పందాలు జరగుతుండగా.. బరి బయట పైపందాలు జరుగుతున్నాయి. పైపందాల్లోనే సుమారు రూ. 40 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నట్లు సమాచారం. పందాలు చూడడానికి వచ్చిన సందర్శకులు వాళ్లల్లో వాళ్లే పందాలు కట్టుకుంటున్నారు. రూ. 10 వేల నుంచి 10 లక్షల వరకు అసలు పందాలు జరుగుతుండగా.. రూ. 500 నుంచి 10 వేల వరకు పై పందాలు జరుగుతున్నట్లు తెలిసింది. రాత్రి పది గంటల వరకు కోళ్ల పందాలు నిర్వహించేలా ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
Also Read
Read Also: Kodi Pandalu: వెయ్యి కట్టు.. బైక్ పట్టు.. పందెం బరుల వద్ద కూపన్ల ఆఫర్లు
సంవత్సరమంతా బలమైన ఆహారంతో మేపిన కోడి పుంజులను పందెంరాయుళ్లు బరిలోకి దింపుతున్నారు. కోత పందాలతో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థి పుంజులను ఢీకొట్టేందుకు బాదం, పిస్తా, వివిధ మెడిసన్లతో పాటు ఆర్మీ సైనికుడికి ఇచ్చిన శిక్షణ మాదిరి ఈత కొట్టించడం, ఇతర శిక్షణ ఇచ్చి కోళ్లను బరిలో దింపుతున్నారు పందెంరాయుళ్లు. ఇక బరుల వద్ద సందడి నెలకొంది. కోడి పందాలు చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. కోడిపందాలతో పాటు పక్కనే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. కోడి పందాలు చట్టరీత్యా నేరమైన రాజకీయ అండదండలతో ఏటా పండుగ మూడు రోజులు నిర్వహించడ ఆనవాయితీగా మారింది. సంప్రదాయంలో భాగంగా కోడి పందాలు అడుతున్నామని పందెంరాయుళ్లు వాదించడం ఇందులో కొసమెరుపు.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!